
విటమిన్ C, విటమిన్ A, ఐరన్, జింక్ లాంటి పోషకాలు పెసర మొలకల్లో ఎక్కువగా ఉండటంతో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా వాతావరణ మార్పుల సమయంలో వ్యాధుల నుంచి రక్షణ ఇస్తాయి. పెసర మొలకల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటంతో చర్మం ఆరోగ్యంగా మెరిసిపోతుంది. పింపుల్స్, మొటిమలు వంటి సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఉండే పొటాషియం మరియు మెగ్నీషియం మానసిక ఒత్తిడిని తగ్గించి, రక్తపోటును నియంత్రిస్తాయి. హార్ట్ ఆరోగ్యాన్ని కాపాడతాయి.పెసర మొలకల్లో ఐరన్ అధికంగా ఉండటంతో ఇది రక్తాన్ని పెంచుతుంది. మహిళలు, గర్భిణీలు తీసుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఫైటోఎస్ట్రోజన్లు మెనోపాజ్ సమయంలో వచ్చే సమస్యలను తగ్గిస్తాయి. మహిళలకు హార్మోన్ల సమతుల్యతకు ఇది సహాయపడుతుంది.
పెసర మొలకలు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన రక్తంలో షుగర్ లెవెల్స్ క్రమంగా పెరుగుతాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారికి మంచిది. యాంటీ ఆక్సిడెంట్లు మరియు కొంతమేర యాంటీ కేన్సర్ గుణాలు ఉండటంతో పెసర మొలకలు కొన్ని క్యాన్సర్ రకాల బారిన పడకుండా రక్షిస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాలి. తాజా మొలకలు మాత్రమే తీసుకోవాలి. కొంచెం నిమ్మరసం, ఉప్పు కలిపి తింటే రుచిగా ఉంటుంది. కూరల్లో లేదా సాలాడ్ రూపంలో కూడా వాడవచ్చు. ఎక్కువ కాలం నిల్వ పెట్టిన మొలకలు తినొద్దు. గ్యాస్ సమస్యలున్నవారు ఎక్కువగా తీసుకోకుండా తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. మొలకలు తినే ముందు సరిగ్గా ఉతకాలి.