అటు సినిమాల్లోనూ ఇటు టీవీ షోలలోనూ తన హవా చాటుతూ ముందుకు దూసుకుపోతోంది ఈ అందాల తార. వెండితెర బుల్లితెర అని తేడా లేకుండా అందివచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకుంటూ అల్లరి చేస్తోంది ఈ అచ్చ తెలుగు అమ్మాయి. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా ఇలా అన్నింటిలోనూ ఓ రౌండ్ చుట్టేస్తున్న ఈ తెలుగు అమ్మాయి మరెవరో కాదు బిగ్ బాస్ షో తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన తేజస్వి మదివాడ. సినిమాలలో కంటే బిగ్ బాస్ షో ద్వారానే తేజస్వి మరింత ఫేమస్ అయిందని చెప్పడంలో అనుమానం లేదు.

బిగ్ బాస్ షో తర్వాత ఈమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఫుల్ ఫేమస్ అయింది తేజస్వి... అలాగే బిబి షో లో తన వైఖరి కారణంగా కాస్త నెగిటివిటీని కూడా మూటకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తన హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ కమిట్మెంట్ సినిమా ప్రమోషన్ లో భాగంగా పెదవి విప్పిన తేజస్వి... సినీ ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె ఏమన్నారంటే...? కాస్టింగ్ కౌచ్ అంటే.. అసభ్యకరమైన మాటలతో ఆడవాళ్లను టార్చర్ చేసే వాళ్లు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారని చెప్పుకొచ్చింది. బోల్డ్ లేడీ గా పేరు తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు మరింత ఓపెన్ గా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. సరిగ్గా చెప్పాలంటే మీరు ఇండస్ట్రీలో ఎదగాలంటే కొందరి కోరికలను తీర్చక తప్పదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది ఈ భామ. అన్ని సందర్భాలలో ఇలాగే ఉంటే నేను చెప్పలేను కానీ... ఇలాంటివి ఇండస్ట్రీలో చాలానే చూశాను.... స్వయంగా నేను కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నాను అంటూ చెప్పుకొచ్చింది తేజస్వి.

ఒక్క ముక్కలో చెప్పాలంటే 90 శాతం ఇక్కడ పడుకోనిదే పనులు జరగవని ఓపెన్ అయింది. ఈమె హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం కమిట్‌మెంట్ సినిమా టీజర్ ఇటీవలే విడుదల కాగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా తన కథను పోలి ఉందని చెప్పుకొచ్చింది తేజస్వి మదివాడ. ఇందులో అమ్మాయిలకు అవకాశం రావాలంటే బెడ్రూమ్‌కు రావాల్సిందే అనే కోణంలో చూపించారు. తన విషయంలో కూడా చాలా మంది అవకాశం కావాలంటే మా రూమ్ కి రావాల్సిందే అంటూ డీల్ మాట్లాడారు... అందుకే చాలా సినిమాలకు దూరం అయ్యానని.... అలాంటి సమస్యలు లేని కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితమయ్యాను. ఇప్పుడైతే చాలావరకు సినిమాలు చేయడం లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. సినిమా ఇండస్ట్రీకి వచ్చే చాలామంది ముందుగానే కమిట్మెంట్‌కు ప్రిపేర్ అయి వస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఈ రోజుల్లో అవకాశాలు రావాలంటే కమిట్మెంట్ అనేది తప్పనిసరి అంటూ తన మాటలతో సంచలనం సృష్టించింది. తనలా ప్రతిభ ఉన్నా సరే ఇండస్ట్రీలో పైకి రాకపోవడానికి కారణం కొందరి కామవాంఛను తీర్చడానికి ఒప్పుకోక పోవడమే అంటూ ఆరోపణలు చేసింది. బాంబే నుంచి వచ్చే హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఎక్కువగా సెటిల్ అవ్వడానికి కారణం వారు దేనికైనా ఒప్పుకుంటారు అన్న  భావాన్ని వ్యక్తపరిచింది తేజు. కానీ  అందరూ కాదు  కొందరి వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందనేది గమనించాలని క్లారిటీ ఇచ్చింది... ఇలా కాస్టింగ్ కౌచ్ గురించి ఎన్నో విషయాలను షేర్ చేసింది తేజస్వి మదివాడ..,!

మరింత సమాచారం తెలుసుకోండి: