ఈనాటికీ మనదేశంలో చాలామంది డబ్బును ఒక దేవతగా చూస్తూ పూజలు చేస్తూ ఆరాధిస్తూ ఉంటారు. అయితే అలాంటి ఆరాధన వల్ల మన దగ్గర ఉన్న డబ్బు పెరగదు. కళ్ళ జోళ్ళకు కూడ మంచి ఫ్రేమ్ లు పెడితే మనిషి మొహానికి అందం పెరుగుతుంది అన్న ఆలోచన పుట్టుకతో అనాథ అయినా డెల్ వాచియో కి రావడంతో అతడు కళ్ళ జోళ్ళ ఫ్రేమ్ ల బిజినెస్ లోకి వచ్చి అతడు 5వేల కోట్లకు అధిపతిగా మారడం వెనుక అతడి ఆలోచనలు పనిచేసాయి కానీ డబ్బును పూజించడం వల్ల అతడు ప్రపంచ వ్యాప్త ధనవంతుడు కాలేదు.


ఏదైనా ఒక చిన్న ఆలోచన వస్తే ఆ ఆలోచనను వదిలి పెట్టకుండా క్రియా రూపంగా మార్చుకోగలిగే నేర్పు ఉంటే ప్రపంచంలో ఎవరైనా ధనవంతుడు కావచ్చు. వాస్తవానికి మనం చేసే పనిని ఎదుటి వాళ్ళు ఎలా చేస్తున్నారో గమనించి అంతకన్నా బాగా చేయగల సమర్థత ఉన్న ప్రతివ్యక్తి ధనవంతుడు అయ్యే ఆస్కారం ఉంది.


మనం దేనిని సాధించాలని అనుకుంటున్నామో దానిని గురించి అధ్యయనం చేయడమే కాకుండా ఆ పనికి సంబంధించిన వివరాలను సమగ్రంగా సేకరించి ఆలోచనలు చేయగలిగిన ప్రతివ్యక్తి వ్యాపారంలో చాల సులువుగా డబ్బును సంపాదించగలుగుతాడు. అంతేకాదు ఒక వ్యాపారానికి సంబంధించి ఎంత పెట్టుబడి పెట్టాలి ఎక్కడ కొనుగోలు చేయాలి అన్న విషయాలలో స్పష్టమైన అవగాహన ఉంటే ఏవ్యక్తి అయినా చాల సులువుగా తాను ఎంచుకున్న వ్యాపారంలో విజయం సాధించవచ్చు.


ముఖ్యంగా డబ్బు మన అవసరం మాత్రమే అని భావించాలి కానీ ఆ డబ్బుకు పవిత్రత ఆపాదిస్తే ఆడబ్బు పట్ల వ్యామోహం పెరిగిపోయి ఎంత దాచినా ఇంకా దాచుకోవాలి అని అనిపిస్తుంది. ఒకే వ్యాపారంలో ఒకడు రాణించాడానికి మరొక వ్యక్తి ఫెయిల్ అవ్వడానికి గల కారణాలను నిజాయితితో విశ్లేషణ చేసుకుంటూ  ఎప్పుడు ప్రశాంతంగా ఉన్న వ్యక్తులు దగ్గర మాత్రమే సంపద వచ్చి చేరుతుంది. ఇదే సంపద రహస్యం..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: