టాలీవుడ్ లో అందరు హీరోలు వరుస సినిమాలు చేయడమే కాదు సూపర్ హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నారు. ఒక ఫ్లాప్ వచ్చిన వెంటనే దాన్ని కవర్ చేసుకుంటూ ఇంకో హిట్ కొడుతూ తమ కెరీర్ ను బాలన్స్ చేసుకుంటూ పోతున్నారు.. కొత్త హీరోలు, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలు సైతం యావరేజ్ హిట్స్ తో అయినా ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకుంటున్నారు.. అయితే అక్కినేని అఖిల్ ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా హిట్ కొట్టలేకపోతున్నాడు.. ఇక తాజాగా అయన నటిస్తున్న నాలుగో సినిమా మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.. ఆ టీజర్ చూసిన జనాలకు ‘ఆరెంజ్’ గుర్తు వచ్చి ఉంటే ఆశ్చర్యమేమీ లేదు.