తెలుగు ఇండస్ట్రీలో అప్పట్లో హృదయకాలేయం చిత్రంతో అందరినీ కడుపుబ్బా నవ్వించిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత సింగం 123 చిత్రంలో హీరోగా నటించాడు.  తనదైన కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్వించే సంపూర్ణేష్ బాబు కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు.  ఇక బిగ్ బాస్ సీజన్ 1 లో మనోడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు..తనకు కుటుంబం గుర్తుకు వస్తుందని...బిగ్ బాస్ ని బండబూతులు తిట్టాడు.  దాంతో ఎలిమినేషన్ కి బదులుగా మామూలుగానే ఇంటినుంచి పంపించారు. 

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వంలో కొబ్బ‌రి మ‌ట్ట అనే చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రంలో పెదరాయుడు, ఆండ్రాయుడ్, పాపారాయిడు ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించి సందడి చేయనున్నాడు సంపూర్ణేష్ బాబు.  ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 1 కంటిస్టెంట్లు అందరూ ఒకే వేదికపై కనిపించబోతున్నారు. 

శివ‌బాలాజీ,సంపూర్ణేష్‌, స‌మీర్, ప్రిన్స్, ముమైత్‌, క‌త్తి మ‌హేష్‌, మ‌ధుప్రియ‌, క‌త్తి కార్తీక‌, క‌ల్ప‌న‌, జ్యోతి, హ‌రితేజ‌, దీక్షాపంత్‌, ధ‌న‌రాజ్‌, అర్చ‌న‌, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ , న‌వ‌దీప్‌లు ఉన్నారు. బిగ్ బాస్ హౌజ్ నుండి వీడిన త‌ర్వాత అంద‌రు క‌లిసి ఒక్క స్టేజీపై క‌నిపించిన సంద‌ర్భాలు లేవు. సంపూర్ణేష్ బాబు నటించిన ‘కొబ్బరి మట్ట’టీజ‌ర్ కార్య‌క్ర‌మం ఈ శుక్రవారం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చేతుల మీదుగా విడుద‌ల కానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: