ప్రస్తుతం భారత దేశంలో ఎన్నో రకాల ఇండస్ట్రీలు  ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ప్రతి ఇండస్ట్రీకి  కూడా ఒక ప్రత్యేకమైన పేరు. ఎలాగంటే ప్రస్తుతం కన్నడ సినిమాలకు కోలీవుడ్ అని . భోజ్పురి సినిమాలకు శాండిల్ వుడ్ అని.. హిందీ సినిమాలకు బాలీవుడ్ అని.. ఇంగ్లీష్ సినిమాలకు హాలీవుడ్ అని ఇలా ప్రతి సినిమా ఇండస్ట్రీకి ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి అనే విషయం తెలిసిందే.  ఇక ఏదైనా  భాషలో సినిమా విడుదల అయింది అంతే చాలు ఆ ఇండస్ట్రీ పేరు గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు.


 అలాగే ప్రస్తుతం మన తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా టాలీవుడ్ అనే పేరు ఉంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో కోలీవుడ్ కూడా ఉన్నప్పటికీ టాలీవుడ్ అతిపెద్ద సినీ ఇండస్ట్రీగా  కొనసాగుతోంది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమ ని ఇంగ్లీష్ లో టాలీవుడ్ అంటారు అనే విషయం అందరికీ తెలిసిందే.  అయితే  మనకు తెలియని మరో టాలీవుడ్ కూడా ఉంది అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. అది కూడా వేరే దేశంలో అనుకునేరు మన ఇండియాలోనే మరో టాలీవుడ్ కూడా ఉంది. ఏంటి ఆశ్చర్య పోతున్నారు కదా.



 కానీ ఇది నిజమే నండి.. ఆ విషయం ఏంటో తెలుసుకుందాం రండి. టాలీవుడ్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి పేరుగానే అందరికి తెలుసు.. కాని బెంగాలీ సినీ ఇండస్ట్రీ పేరు కూడా టాలీవుడ్ అని పిలుస్తారట. పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలోని ఎక్కువగా సినీ స్టూడియో లు ఉండడంతో  ఈ పేరు వచ్చింది అని చెబుతూ ఉంటారు. అంతే కాకుండా అప్పట్లో మొత్తం సినీ కళాకారులు కలకత్తాలోని టాలి గంజ్  అనే ప్రాంతం నుంచి మాత్రమే ఉండేవారని అందుకే హాలీవుడ్ నుంచి వుడ్ తీసుకొని ఇక బెంగాల్ సినిమా ఇండస్ట్రీకి టాలీవుడ్ అనే పేరు పెట్టారు. ఇప్పుడు కూడా అక్కడ టాలీవుడ్ అని పిలుచుకుంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: