తెలుగు చిత్ర పరిశ్రమలో కుటుంబ కథా చిత్రాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఇలాంటి సినిమాలనైనా చూస్తారో లేదో తెలియదు కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా ఉండే సినిమాలు మాత్రం తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇలా కుటుంబ కథా చిత్రాలుగా తెర మీదికి వచ్చి  ఎన్నో సినిమాలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి.  ఇలాంటి సినిమాలలో ఒకటి అక్కినేని వారి కోడలు సమంత నటించిన ఓ బేబీ సినిమా. పెళ్లి తర్వాత ఫుల్ సక్సెస్ లో దూసుకుపోతున్న సమంత ఓ బేబి అనే లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటించింది. అయితే ఒక వైవిధ్యమైన కథతో తెరకెక్కిన ఈ సినిమా అటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.



 కొరియన్ మూవీ అయిన మిస్ గ్రానీ తెలుగు రీమేక్ గా తెరకెక్కింది ఓ బేబీ సినిమా. అయితే ఈ సినిమాలో వయస్సు పైబడిన మహిళ పాత్రలో ఇక సీనియర్ యాక్టర్ లక్ష్మి నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ఒక తల్లి యొక్క ప్రేమ ఆరాటాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.  60, 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో కోడలు, కొడుకు ఇక మనవళ్లు, మనవరాళ్లు ఉన్న సమయంలో.. కుటుంబంపై మహిళ ఎంతగానో ప్రేమను చూపిస్తూ ఉంటుంది. కానీ జనరేషన్ గ్యాప్ కారణంగా  ఆ మహిళ చూపించే ప్రేమ  అందరికీ చాదస్తంగా అర్థమవుతూ ఉంటుంది.



 కానీ ఒక్కసారి అందరికి ఆ వృద్ధురాలు దూరమైతే పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూపిస్తూనే.. ఇక వృద్ధురాలిది చాదస్తం కాదు.. అమితమైన ప్రేమ అన్న విషయాన్ని సినిమాలో అద్భుతంగా చూపించాడు దర్శకుడు. తన కొడుకు ఎంత పెద్ద వాడు అయినప్పటికీ తల్లికి మాత్రం తన వడిలో నిద్రపోయే చిన్నపిల్లాడిలా గానే కనిపిస్తాడు అనే ఎమోషన్ ప్రేక్షకుల మనసును తాకుతుంది. ప్రతి కుటుంబంలో నాన్నమ్మ,అమ్మమ్మ,తాతయ్యల పాత్ర ఎంత ముఖ్యమైనది అన్న విషయాన్ని ఇక ఈ సినిమా చెప్పకనే చెబుతుంది. ఇక ఈ సినిమాలో సమంత, నటి లక్ష్మి తమ పాత్రలో ఒదిగిపోయి నటించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: