స్లో అండ్‌ స్టడీ విన్స్‌ ది రేస్‌ అన్నట్టుగా జర్నీ చేసే నాగచైతన్య ఈ ఏడాది మూడు సినిమాలతో హడావిడి చేస్తున్నాడు. ఇప్పటికే సంక్రాంతికి 'బంగార్రాజు'గా హిట్ కొట్టాడు. ఇక జులైలో థ్యాంక్యూ సినిమాని విడుదల చేయబోతున్నాడు. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చై లుక్‌ యూనిక్‌గా ఉండబోతోంది. అలాగే ఆమిర్‌ ఖాన్‌తో కలిసి చేసిన 'లాల్‌ సింగ్‌ చడ్డా' ఈ ఆగస్ట్‌ 11న విడుదలవుతోంది.

డైలాగ్‌ డెలివరీలో బుల్లెట్‌ ట్రైన్‌లా దూసుకెళ్లే నిఖిల్‌ ఈ ఏడాది బాక్సాఫీస్‌ దగ్గర కూడా ఇదే స్పీడ్‌ చూపించబోతున్నాడు. పల్నాటి సూర్యప్రతాప్‌ దర్శకత్వంలో చేసిన '18 పేజెస్' సినిమా ఈ ఏడాది విడుదలవుతోంది. అలాగే 'కార్తికేయ' సీక్వెల్‌గా చేసిన 'కార్తికేయ2' జులై 22న వస్తోంది. ఇక ఈ రెండు సినిమాల్లో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా చేస్తోంది. వీటితోపాటు మల్టీలింగ్వల్‌ మూవీ 'స్పై' కూడా ఈ ఏడాదిలోనే రాబోతోంది. దసరాకి ఈ సినిమాని విడుదల  చేయాలనుకుంటున్నారు మేకర్స్.

నాగశౌర్యకి 'వరుడు కావలెను, లక్ష్య' సినిమాలతో షాకులు తగిలాయి. ఈ ఫ్లాపులతో పడిపోయిన గ్రాఫ్‌ని మళ్లీ నిలబెట్టడానికి ఈ ఏడాది మూడు సినిమాలు విడుదల  చేస్తున్నాడు. అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన 'కృష్ణా వ్రింద విహారి' నేడు విడుదలయింది. అలాగే అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో చేస్తోన్న 'ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి' సినిమాని ఇదే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. వీటితోపాటు కె.పి.రాజేందర్‌తో చేస్తోన్న 'పోలీస్‌ వారి హెచ్చరిక' సినిమాని ఈ ఏడాదిలోనే దింపాలనుకుంటున్నాడు శౌర్య.

ఆది సాయి కుమార్‌ సరైన హిట్‌ చూసి చాలా రోజులు అయింది. అయితే ఫ్లాపులతో పడిపోయిన మార్కెట్‌ని మళ్లీ దక్కించుకోవడానికి నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. వీరభద్రమ్ దర్శకత్వంలో చేస్తోన్న 'కిరాతక', హై వోల్టేజ్ యాక్షన్‌ డ్రామా 'తీస్‌మార్ ఖాన్' ఈ నెలలోనే రిలీజ్‌ కాబోతున్నాయి. అలాగే ఆది పోలీస్‌గా చేస్తోన్న 'బ్లాక్', 'జంగిల్' సినిమాలు ఈ ఏడాదే విడుదల అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: