జీవితా- రాజశేఖర్.. ఈ ఇద్దరి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే హీరోయిన్ గా దర్శకురాలిగా జీవిత తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు సంపాదించుకున్నాడు రాజశేఖర్. ఒకానొక సినిమా సమయంలో ఇద్దరి మనసులు కలిసాయి. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు అనే విషయం తెలిసిందే.  ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్యోన్య దంపతులలో అటు జీవిత- రాజశేఖర్ పేరు కూడా వినిపిస్తోంది అని చెప్పాలి.


 ఇకపోతే ఇటీవల వీరి పెళ్లికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది. జీవిత రాజశేఖర్ పెళ్లి చేసుకున్న సమయంలో ఏకంగా పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఇందుకు సంబంధించిన వార్త వైరల్ గా మారింది. ఇది తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. ఇంతకీ ఏమి జరిగిందంటే.. 1991 లో జీవిత రాజశేఖర్పెళ్లి చెన్నైలో జరిగింది. అయితే రాజశేఖర్ తండ్రి పెద్ద పోలీస్ ఆఫీసర్.. ఈ క్రమంలోనే వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ పెళ్లికి ఎంతోమంది సెలబ్రిటీలతో పాటు అభిమానులు రాజకీయ నాయకులు కూడా వచ్చారు.. అయితే పెద్దయెత్తున సెలబ్రిటీలు ఈ పెళ్ళికి రావడంతో ఇక అంత మంది సెలబ్రెటీలను ఒకే వేదికపై చూసిన అభిమానులు తమ ఉత్సాహాన్ని ఆపుకోలేక పోయారు.


 ఈక్రమంలోనే పెళ్లి వేడుక దగ్గరికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో రాజశేఖర్ తండ్రి అభిమానులపై లాఠీచార్జి చేయించారట. అయితే ఈ విషయం మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదట. ఇక ఈ విషయాన్ని బయట పెట్టింది ఎవరో కాదు రాజశేఖర్ కు వీరాభిమాని అయినా జబర్దస్త్ కామెడీ తడివేలు కావడం గమనార్హం. రాజశేఖర్ పెళ్లి కి ఎంతో అభిమానంతో వెళ్లి చివరికి పోలీసులు లాఠీ దెబ్బలు తిన్నాను అంటూ ఈ విషయాన్ని స్వయంగా అతనే ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: