నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ ఎన్నో మూవీ లలో నటించి మంచి విజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే కళ్యాణ్ రామ్ నటించిన ఆఖరి 5 సినిమాలు మొదటి రోజు సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.

నిన్న అనగా ఆగస్ట్ 5 వ తేదీన కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార మూవీ విడుదల అయ్యింది  ఈ మూవీ 6.30 కోట్ల కలెక్షన్ లను బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు రాబట్టింది. ఈ మూవీ కి మల్లాడి వశిష్ట్ దర్శకత్వం వహించగా,  క్యాథరిన్ , సంయుక్త మీనన్మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఎంత మంచి వాడవురా సినిమా మొదటి రోజు 2.20 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన మెహరిన్ హీరోయిన్ గా నటించగా, సతీష్ వేగేశ్నమూవీ కి దర్శకత్వం వహించాడు. కళ్యాణ్ రామ్ హీరోగా శాలిని పాండే హీరోయిన్ గా కె వి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన 118 సినిమా మొదటి రోజు 1.60 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

కళ్యాణ్ రామ్ హీరోగా తమన్నా హీరోయిన్ గా తెరకెక్కిన నా నువ్వే సినిమా 0.75 కోట్ల కలెక్షన్ లను మొదటి రోజు వసూలు చేసింది. కళ్యాణ్ రామ్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎం ఎల్ ఏ సినిమా మొదటి రోజు 2.72 కోట్ల కలెక్షన్ లను సాధించింది. కళ్యాణ్ రామ్ ఆఖరి 5 సినిమాలు మొదటి రోజు సాధించిన కలెక్షన్ ల వివరాలు ఇవే.

మరింత సమాచారం తెలుసుకోండి: