డి సురేష్ బాబు తన కుమారుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం చేస్తున్నారు డైరెక్టర్ తేజ. ఈ డైరెక్టర్ తేజ ఎక్కువగా ప్రేమ కథ చిత్రాలను మాత్రమే తెరకెక్కిస్తూ ఉంటాడు. అలా ఇప్పుడు అహింస అనే సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా గీతిక తివారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైపోతున్నది. ఇక ఈ సినిమా షూటింగ్ మధ్యప్రదేశ్ లోనే మారుమూల ప్రాంతాలలో షూటింగ్ చేసినట్లుగా సమాచారం. షూటింగ్ పూర్తి అయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా శరవేగంగా జరుపుకుంటున్నారు. ఇక దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు డైరెక్టర్ తేజ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.


ఇక బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ తో కలిసి సీత చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ చిత్రాన్ని కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది. అహింసా సినిమాతో మళ్లీ తన హవా కొనసాగాలని ప్రయత్న చేస్తున్నారు డైరెక్టర్ తేజ. ఈ సినిమా పైన చాలానే నమ్మకంతో ఉన్నారు. ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా తర్వాత డైరెక్టర్ తేజ రానా తో ఒక భారీ మూవీకి శ్రీకారం చుట్టబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో హీరో రానా ,కాజల్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం నేనే రాజు నేనే మంత్రి.. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.ఈసారి అదే పందాతో రానాతో మరో సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ ప్రోడక్ట్ ని సురేష్ ప్రొడక్షన్ అధినేత డి. సురేష్ బాబు నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇక రీసెంట్గా పదం కూడా రానా కి తేజ వినిపించగా ఫైనల్ స్టేజ్ లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో రానా హీరోగా రాక్షస రాజు రావణాసురుడు అనే టైటిల్ తో ఒక సినిమాని ప్రకటించారు.. సురేష్ ప్రొడక్షన్లోనే ఈ చిత్రాన్ని చేయాలని సన్నాహాలు చేశారు. కానీ కొన్ని కారణాల చేత ఆ సినిమా ఆగిపోయింది ఇప్పుడు తాజా సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు  హీరో రానా, తేజ. మరి ఈ విషయంపై అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: