
గుమ్మడి గింజలు అధికంగా ఉన్నది జింక్ అనే మినరల్. ఎవరికైనా మరుపు వ్యాధి ఉన్నవారికి జింక్ పుష్కలంగా లభించే ఆహారాలను పెట్టడం వల్ల, వారికి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. జింక్ లోపం వల్లే పిల్లల్లో కానీ,వయసు మళ్ళిన వాళ్లలో కానీ,మతిమరుపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గుమ్మడి గింజల్లో జింక్ అధికంగా ఉంటుంది.
గర్భిణీ స్త్రీలకు కూడా జింక్ ఉన్న ఆహారం ఇవ్వడం వల్ల కడుపులో పెరిగే బిడ్డకు మెదడు అభివృద్ధి జరిగి పిల్లలు తెలివితేటలతో, చురుగ్గా జన్మిస్తారు. గుమ్మడి గింజలను తగిన మోతాదులో సలాడ్ రూపంలోనూ,స్నాక్ లాగా తినవచ్చు.
గుమ్మడి గింజల వల్ల ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెగ్నీషియం, కాపర్, ఫైబర్,ప్రోటీన్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ గింజలను మోతాదులో తీసుకోవడం వల్ల విటమిన్ ఈ పుష్కలంగా అందుతుంది.దీని వల్ల గుండె సంబంధిత రోగాలు దరి చేరవు.
ఇందులో ఉండే అధిక ఫైబర్ వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కూడా ఈజీగా కరుగుతుంది.ఈ గింజల్లో కుకుర్బిటిన్ అనే అమైనోఆమ్లం వల్ల, జుట్టు కుదుళ్ళు దృఢంగా పెరిగేలా చేస్తుంది.
గుమ్మడి గింజలలోని మెగ్నీషియం అధికంగా ఉంటుంది.ఇది ఎముకలను పటిష్టంగా తయారు చేస్తుంది.వీటి వల్ల అస్థియోపోరోసిస్ వంటి వ్యాధులు దరిచేరకుండా కాపాడుతుంది.
ఈ గింజల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కళంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వేడిని తగ్గిస్తాయి.అందువల్ల రోజూ ఈ గింజలు తింటే,జలుబు, జ్వరం దరిచేరవు .అందు చేతనే ప్రతి ఒక్కరు గుమ్మడి గింజలు తినడం మంచిది.