టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య  హీరోగా తమిళ స్టార్ దర్శకుడు వెంకట్ ప్రభు ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సినిమా వస్తుంది.నాగ చైతన్యకు తొలి స్ట్రయిట్ తమిళ సినిమా కూడా ఇదే. ఇక ఈ రోజు చైతు బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ కొత్త సినిమాకు 'కస్టడీ' టైటిల్ ఖరారు చేసినట్టు తెలిపారు.నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారు.ఇక టాలీవుడ్ యంగ్ హీరో రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో నిర్మించిన 'ది వారియర్' తర్వాత ఆయన నిర్మిస్తున్న సినిమా ఇదే. నాగ చైతన్యకు ఆయన కెరీర్లో ఇది 22వ చిత్రమిది. అందుకే , NC 22 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాని పిలుస్తున్నారు.ఇక 'కస్టడీ' సినిమాలో నాగ చైతన్య ఓ పవర్ ఫుల్  పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నట్లు ఒక్క రోజు ముందు విడుదల చేసిన ప్రీ లుక్ చూస్తే పూర్తిగా అర్థం అయిపోతుంది. ఆ పోస్టర్లో తోటి అధికారులు చైతూని కదలకుండా తమ చేతుల్లో ఎందుకు బంధించారనేది సస్పెన్స్. 


ఇక ఈ సినిమాలో హీరో చైతు పేరు 'ఏ చైతన్య'. ఏ అంటే అక్కినేని అయ్యి ఉంటుందని ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే... ఇది ఫుల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లా ఉంది. చైతూ లుక్‌లో పూర్తిగా ఇంటెన్సిటీ కనిపిస్తోంది. 'ప్రపంచంలో మార్పు రావాలంటే... అది ముందుగా నీలో రావాలి' అని అర్థం వచ్చేలా ఓ సూపర్ కొటేషన్ ని కూడా చూపించారు.ఇక ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా ఈ  కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. వీళ్ళ ఇద్దరిదీ కూడా సూపర్ హిట్ జోడీ. వీళ్ళిద్దరూ గతంలో సూపర్ హిట్ సినిమా అయిన 'బంగార్రాజు' సినిమాలో సందడి చేశారు. అందులో వీరు కాంబోలో వచ్చిన పాట 'బంగార... బంగార...' సాంగ్ కూడా సూపర్ హిట్ అయింది. ఇక మరో సారి ఈ సినిమాలో ఈ జంట సందడి చేయనుంది.'థాంక్ యూ' సినిమాతో ప్లాప్ ఎదురుకున్న నాగ చైతన్య ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలని ఫుల్ కసిగా వున్నాడు. వెంకట్ ప్రభు వంటి సూపర్ డైరెక్టర్ కావడంతో చైతూ ఫ్యాన్స్ కూడా చాలా నమ్మకంగా వున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: