తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో రూపొందిన వారిసు అనే తమిళ మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా , తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు  ఈ మూవీని తమిళ్ భాషలో జనవరి 11 వ తేదీన విడుదల చేయగా , జనవరి 14 వ తేదీన ఈ సినిమాను తెలుగు భాషలో వారసుడు పేరుతో విడుదల చేశారు.

ఈ మూవీకి తెలుగు మరియు తమిళ భాషల్లో ప్రస్తుతం మంచి కలక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల కాకముందే ఈ సినిమా నుండి రంజితమే అనే తమిళ్ లిరికల్ వీడియో సాంగ్ ను ఈ చిత్రం బృందం విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సాంగ్ కు విడుదల అయిన రోజు నుండే ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో అదిరిపోయే రేర్ మార్క్ వ్యూస్ ను టచ్ చేసింది. 

ఈ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్ లో 150 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది అని చెప్పవచ్చు. వారసు మూవీ లోని రంజితమే సాంగ్ తో పాటు ఇతర పాటలకు కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే రంజితమే తెలుగు వర్షన్ సాంగ్ ను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేయగా , ఈ తెలుగు వర్షన్ సాంగ్ కు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: