ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హిట్ ఫ్లోప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అంటే సుందరానికి సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడంతో దసరా సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు నాని. ఊర మాస్ మసాలాగా వస్తున్న ఈ సినిమాలో నాని ఎన్నడూ కనిపించని విధంగా ఒక సరికొత్త పాత్రలో కనిపించిన ఉన్నాడు. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో వస్తున్న దసరా సినిమాలో నాని బొగ్గు కార్మికుడిగా కనిపించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ నేపథ్యంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భార్య అంచనాలు నెలకొన్నాయి .అంతేకాదు సింగరేణి నేపథ్యంగా కదా ఉండడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతుంది .

శ్రీకాంత్ ఈ సినిమా కథను ఈ విధంగా తెలియజేయనున్నాడు అన్న క్యూరియాసిటీ ఇప్పుడు అందరిలోనూ పెరిగిపోయింది,ఇక ఈ సినిమాలో నాచురల్ స్టార్ నానికి జంటగా కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది .ఇప్పటికి ఈ సినిమాకి సంబంధించిన టీజర్ పోస్టర్లు పాటలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీజర్ పోస్టర్లు పాటలు మంచి రెస్పాన్స్ అందుకోవాలనితో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది అన్న భీమాతో ఉన్నాడు నాని .ఇదిలా ఉంటే ఇక ఈ సినిమా తర్వాత నాని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు తండ్రి కూతుర్ల బాండింగ్ ఈ సినిమాలో హైలెట్గా నిలుస్తుంది

 అని కూడా అంటున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను మోహన్ చేకూరి డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల మూర్తికే ఎస్ సంయుక్తంగా నిర్మించడం జరుగుతుంది. ఈ సినిమాతో శౌర్యవ్ అనే ఒక కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం కానున్నాడు .ఇక ఈ సినిమాలో నానికి జోడిగా మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు నాని తన రెమ్యూనరేషన్ను పెంచేశాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాని తన ఒక్కో సినిమాకి గాను దాదాపు 22 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారట. నాని సినిమా చేస్తున్నాడు అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. అందుకే దర్శక నిర్మాతలు సైతం నాని డిమాండ్ చేసినంత రెమ్యూనిరేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: