సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా శాకుంతలం. ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించారు. సినిమా ఫైనల్ కాపీ చూసిన టీం సినిమాపై చాలా సంతృప్తి గా ఉన్నారు. శాకుంతలం సినిమాలో సమంతకి జోడీగా మలయాళ స్టార్ దేవ్ మోహన్ నటించాడు. అయితే ముందు గుణశేఖర్ ఈ పాత్రకి దుల్కర్ సల్మాన్ ని తీసుకోవాలని అనుకున్నారు. కానీ అప్పటికే అతను సీతారామం సినిమాకు డేట్స్ ఇవ్వడంతో ఈ సినిమాలో నటించడం కుదరలేదు.

మలయాళ నటుడే అయినా దుల్కర్ సల్మాన్ కి తెలుగు లో మంచి క్రేజ్ వచ్చింది. మహానటి, సీతారామం రెండు సినిమాలు అతనికి మంచి సక్సెస్ అందించాయి. అయితే గుణశేఖర్ డైరెక్షన్ లో సినిమాలో దేవ్ మోహన్ బదులుగా దుల్కర్ సల్మాన్ ఉండి ఉంటే సినిమా బిజినెస్ పరంగా కూడా మరో రేంజ్ లో ఉండేదని చెప్పొచ్చు. తెలుగు ఆడియన్స్ కు ఏమాత్రం పరిచయం లేని దేవ్ మోహన్ తో ఈ సినిమా చేశారు గుణశేఖర్. అయితే సినిమాలో సమంత తన నటనతో సర్ ప్రైజ్ చేస్తుందని సినిమాలో ఆమె ప్రతిభతో అందరిని షాక్ ఇస్తుందని అంటున్నారు.

సమంతతో పాటుగా మిగతా నటీనటులు కూడా సినిమాకు బాగా హెల్ప్ అయ్యారని తెలుస్తుంది. దిల్ రాజు ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నేషనల్ లెవల్ లో ఆడియన్స్ ని అలరించాలని చూస్తుంది. ఈ సినిమాతో పాటుగా సమంత విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా సమంత బాలీవుడ్ లో వెబ్ సీరీస్ లను చేస్తుంది. అక్కడ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది సమంత. మొత్తానికి సమంత అక్కడ ఇక్కడ రెండు చోట్ల బిజీ అవుతుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: