మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోయిన సంవత్సరం మార్చి 25 వ తేదీన విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తో అద్భుతమైన విజయాన్ని ... అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండగా ... అందాల ముద్దుగుమ్మ కియార అద్వానీ ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. 

ఇప్పటికే ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి ఎన్నో సినిమాలలో నటించి దర్శకుడిగా ... నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న ఎస్ జే సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో శ్రీకాంత్ , సునీల్ , అంజలి ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ...  తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ రోజు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఉదయం ఈ సినిమా బృందం ఈ మూవీ యొక్క టైటిల్ ను అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి రామ్ చరణ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది.

తాజాగా ఈ మూవీ బృందం విడుదల చేసిన రామ్ చరణ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో రామ్ చరణ్ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో స్పెడ్స్ పెట్టుకొని ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ... శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అదిరిపోయే రేంజ్ లో అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: