
ఇలాంటి సమయంలోనే ఇటీవల కాలంలో హీరో హీరోయిన్లకు సంబంధించి త్రో బ్యాక్ ఫోటోలు ఎప్పుడు ఏదో ఒకటి సోషల్ మీడియాలో తెరమీదకి వచ్చి హాట్ టాపిక్ గా మారిపోవడం జరుగుతూనే ఉంటుంది. అయితే ఇలా కొన్ని కొన్ని సార్లు త్రో బ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలోకి వచ్చినప్పుడు.. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో ఇట్టే గుర్తు పట్టేస్తూ ఉంటారు నేటిజన్స్. ఈ క్రమంలోనే వారి పేరును కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని త్రో బ్యాక్ ఫోటోలను చూసిన తర్వాత అందులో ఉన్నది ఎవరబ్బా అసలు గుర్తుపట్టలేకపోతున్నామని తల గోక్కుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇలాంటి ఫోటోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
పైన ఉన్న ఫోటోలో సర్కిల్లో ఎంతో బొద్దుగా కనిపిస్తున్న టీనేజ్ అమ్మాయి ఎవరు అన్నది గుర్తుపట్టలేకపోతున్నారు నేటిజన్స్. ఆమె తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్గా రాణిస్తుంది. వరుసగా అవకాశాలు అందుకుంటుంది. ఫోటోలో కనిపించే ఆ టీనేజ్ అమ్మాయి ఏంటి? హీరోయిన్ ఏంటి? అసలు నిజంగానే ఆమె హీరోయినేనా అనే అనుమానం ఈ ఫోటో చూసిన తర్వాత కలగక మానదు. అయితే ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఆ ముద్దుగుమ్మ ఇక ఇప్పుడు సన్నజాజిలాగా మారిపోయింది. ఆమె ఎవరో కాదు కళ్యాణి ప్రియదర్శిన్. అఖిల్ అక్కినేని నటించిన హలో మూవీతో ఈమె కెరియర్ స్టార్ట్ చేసింది. తర్వాత చిత్రలహరి, రణరంగంలో కూడా నటించింది. ఇక ఇప్పుడు తమిళం మలయాళం సినిమాల్లో నటిస్తుంది.
