ఆ తర్వాత ఆమె నటించిన యమలీల సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో.. ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. కొంతకాలం పాటు హీరోయిన్ గా రాణించి పలు సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న ఈ మద్దుగుమ్మ ఆ తర్వాత మాత్రం ఇండస్ట్రీకి దూరమైపోయింది. ఇక కొన్నాళ్లు సైలెంట్ గా ఉండి ఆ తర్వాత లయన్ అనే సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది ఇంద్రజ. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సూపర్ సక్సెస్ అయింది అని చెప్పాలి. అంతేకాదు జబర్దస్త్ లాంటి టీవీ షోలో జడ్జిగా ప్రత్యక్షమై తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గర అయింది.
అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంద్రజకు.. ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురయింది. మీరు రిజెక్ట్ చేసిన సినిమాల్లో చేసి ఉంటే బాగుండేది అనిపించిన హిట్ సినిమా ఏది అంటూ ప్రశ్నించగా.. షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది ఇంద్రజ. రాఘవేంద్రరావు పెళ్లి సందడి సినిమా తీసే సమయంలో నా గురించి నటి ఊహ గారి గురించి ఒక వార్త బాగా సర్క్యూలేట్ అయింది. అదేంటంటే ఊహ గారికి నాకు మధ్య చాలా సెమిలారిటీస్ ఉండేవని. ఆమె నేను సేమ్ కనిపించే వాళ్ళం. అందుకే మా ఇద్దరిని అక్క చెల్లెలుగా పెళ్లి సందడి సినిమా లో తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ అది ఎందుకు నిజం కాలేదు అన్న విషయం మాత్రం నాకు తెలియదు. ఒకవేళ ఆ మూవీలో మిమ్మల్ని తీసుకుని ఉంటే చాలా సంతోషించే దాన్ని. ఎందుకంటే ఆ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది అంటూ ఇంద్రజ చెప్పకు వచ్చింది. ఈ విషయం తెలిస్తే దేనికైనా రాసిపెట్టి ఉండాలి అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు ఇంటర్నెట్ జనాలు.