టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకుంది. ఆ సినిమా అనంతరం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా తన హవాను కొనసాగిస్తుంది. సమంత నటన, అందచందాలకు ఎన్నో అవార్డులు సైతం వచ్చాయి. ఈ క్రమంలోనే సమంత తెలుగుతో పాటు హిందీలోనూ నటించడానికి సిద్ధమయ్యారు.

హిందీలోనూ వెబ్ సిరీస్ లలో నటిస్తూ అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగు, హిందీ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇక సమంత ఒక్కో సినిమాలో నటించడానికి భారీగా రెమ్యూనరేషన్ వసూలు చేస్తోంది. కాగా, సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే సమంతకు సంబంధించి ఓ వార్తను సోషల్ మీడియా మాధ్యమాల్లో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.

సమంతకు టాలీవుడ్ ఇండస్ట్రీలో తన ఫేవరెట్ హీరో ఎవరో చెప్పేసింది. మహేష్ బాబు తన ఫేవరెట్ హీరో అని చెప్పింది. తన నటన, హ్యాండ్సమ్ లుక్ అంటే తనకు చాలా ఇష్టం అంటూ సమంత చెప్పేసింది. మహేష్ బాబుతో సినిమాలో నటించే సమయంలో చాలా ఎంజాయ్ చేస్తానని మహేష్ బాబు చాలా కూల్ గా ఉంటారంటూ సమంత వెల్లడించారు. మహేష్ బాబుతో సినిమాలో నటించడం అంటే తనకు చాలా ఇష్టం అంటూ సమంత చెప్పారు. దీంతో ఈ విషయం తెలిసిన మహేష్ బాబు అభిమానులు సంబరపడుతున్నారు. ప్రస్తుతం సమంత షేర్ చేసుకున్న ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: