సూర్య..  టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.  పేరుకే కోలీవుడ్ స్టార్ హీరో కానీ కోలీవుడ్ లో కన్నా కూడా టాలీవుడ్ జనాలు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు హీరో సూర్య ని. "కంగువ" సినిమా తర్వాత ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో సూర్య చేసిన మూవీ "రెట్రో" కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ అందుకుంది . కొంతమంది నెగిటివ్ గా కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు . కానీ సూర్య ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమా బాగా నచ్చేసింది .


ఇలాంటి మూమెంట్లోనే సూర్యకి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. హీరో సూర్య తన మనసులోని కోరికను బయటపెట్టాడు . అది విన్న జనాలు షాక్ అయిపోతున్నారు . అంతేకాదు ఆ కోరిక ఈ జన్మలో నెరవేరదు పో అంటూ కూడా కొట్టి పడేస్తున్నారు . హీరో సూర్యకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా చాలా ఇష్టం . చాలా సందర్భాలలో ఆ విషయాన్ని బయటపెట్టారు . ఎన్నో ఇంటర్వ్యూలలో పవన్ కళ్యాణ్ గురించి  ఆ విషయాని బయట పెట్టారు.



కాగా పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని ఉంది అంటూ ఆశపడుతున్నాడు సూర్య . తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్స్ ఉన్నారు.  చాలామంది తో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు సూర్య . కానీ ముఖ్యంగా ఆయన  మల్టీ స్టారర్ సినిమా ఓకే చేయాలి అనుకుంటే ఫస్ట్ గుర్తొచ్చే హీరో పవన్ కళ్యాణ్ అంటూ చెప్పుకొచ్చారు . అయితే పవన్ కళ్యాణ్ ప్రెసెంట్ సినిమాలకి దూరంగా ఉన్నాడు . కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేయడమే పెద్ద గగనంగా మారిపోయింది. కొత్త సినిమాలకి కమిట్ అవ్వడం లేదు పైగా పాలిటిక్స్ లో బిజీ బిజీ అయిపోయాడు . ఇంకా కొత్త సినిమాలు చేస్తాడు పవన్ కళ్యాణ్ అన్న అసలు కూడా ఎవరికీ లేదు . అలా చూసుకుంటే ఇక హీరో సూర్య కోరిక ఎప్పటికి నెరవేరదేమో అంటూ ముందుగానే అది జన్మలో నెరవేరని కోరిక అంటూ ఫ్యాన్స్ ఓపెన్గానే కామెంట్స్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: