టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అంద చందాలతో అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి కాజల్ అగర్వాల్ ఒకరు. ఈ భామ ఎంతో అందంగా, కుందనపు బొమ్మల ఉంటుంది. ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా తన నటన, అందంతో కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో మాత్రమే నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించిన కాజల్ అగర్వాల్ సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్ గా తన సత్తాను చాటుకుంది.

 కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీనీ తన ఒంటి చేతితో ఏలిందని చెప్పవచ్చు. ఎంతోమంది పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటించి సినిమాలలో అవకాశాలను సొంతం చేసుకుంది. ఇక తన కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. వివాహం తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. అనంతరం ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన అనంతరం కాజల్ తన మాతృత్వాన్ని ఆస్వాదించింది. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ కాజల్ కు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. ఏవో కొన్ని సినిమాలలో మాత్రమే అవకాశాలను అందుకుంది.

వివాహం తర్వాత తన అందాన్ని పూర్తిగా కోల్పోయిందని చాలామంది తనకు సినిమా అవకాశాలు ఇవ్వడానికి ముందుకు రాలేకపోయారు. ఈ క్రమంలోనే కాజల్ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలో ఈ బ్యూటీకి స్పెషల్ సాంగ్ లో నటించే అవకాశం వచ్చిందట. ఇప్పటికే ఈ విషయం డైరెక్టర్ బుచ్చిబాబు కాజల్ కు వివరించగా ఆమె కాస్త సమయం కావాలని కోరిందట. రామ్ చరణ్, కాజల్ ఇదివరకే నటించిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. పెద్ది సినిమాలో కాజల్ కనుక స్పెషల్ సాంగ్ చేస్తే ఆ సినిమాకి ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారట. మరి ఇందులో స్పెషల్ సాంగ్ చేయడానికి కాజల్ ఒప్పుకుంటుందా లేదా అనే సందేహంలో చాలామంది ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: