
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం ` కింగ్‌డమ్ ` . సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ మే 30న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కింగడ్‌మ్ చిత్రంలోని చివరి 40 నిమిషాలు అద్భుతమని.. యాక్షన్ సీన్స్, విజయ్ పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్పడంతో మరింత హైప్ క్రియేట్ అయింది.
అయితే ఇదే తరుణంలో విజయ్ ఫ్యాన్స్ ను ఓ బ్యాడ్ సెంటిమెంట్ భయపెడుతోంది. అదే ఇంగ్లీష్ టైటిల్. విజయ్ దేవరకొండ కెరీర్ ను ఆరంభం నుంచి గమనిస్తే.. ఇంగ్లీష్ టైటిల్ తో వచ్చిన ఏ సినిమా హిట్ అవ్వలేదు. విజయ్ దేవరకొండ కెరీర్ ప్రారంభించిన తర్వాత ఇంగ్లీష్ టైటిల్ తో వచ్చిన మొదటి సినిమా ` నోటా ` తెలుగు, తమిళంలో విడుదలై డిజాస్టర్ అయింది. ఆ తర్వాత విజయ్ కెరీర్ లో ఇంగ్లీష్ టైటిల్ తో వచ్చిన మరో చిత్రం ` డియర్ కామ్రేడ్ ` . విజయ్ యాక్టింగ్, మేకింగ్ బాగున్నా.. సినిమా మాత్రం కమర్షియల్ గా ఫ్లాప్ అయింది.
` వరల్డ్ ఫేమస్ లవర్ ` , ` లైగర్ ` చిత్రాలు కూడా ఇంగ్లీష్ టైటిల్ తో వచ్చినవే. అయితే వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఎందుకంటే ఈ చిత్రాలు దారుణమైన ఫలితాలను అందుకున్నాయి. గత ఏడాది విజయ్ ` ఫ్యామిలీ స్టార్` మూవీతో పలకరించాడు. ఈ సినిమా సైతం నిరాశ పరిచింది. మొత్తంగా ఇంగ్లీష్ టైటిల్ అనేది కెరీర్ ఆరంభం నుంచి విజయ్ కు కలిసి రావడం లేదు. ఇంగ్లీష్ టైటిల్ తో వచ్చిన ప్రతిసారి అతనికి బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ ఎదురవుతూనే ఉంది. ఇక ఇప్పుడు ఈ బ్యాడ్ సెంటిమెంట్ ను కింగ్‌డమ్ మూవీ బ్రేక్ చేసి హిట్ కొడుతుందా? అన్నది విజయ్ దేవరకొండ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు