ప్రస్తుతం ఎక్కడ చూసినా ఖయాదు లోహర్ పేరే వినిపిస్తోంది. ఈ భామ తనదైన నటన, అందంతో విపరీతంగా అభిమానులను సంపాదించుకుంది. 2021లో మొగిల్ పేట అనే కన్నడ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్న ఈ చిన్నది ఆ సినిమా అనంతరం అనేక సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కన్నడ, మలయాళం, తెలుగు, హిందీ ఇలా అనేక భాషా సినిమాలలో హీరోయిన్ గా చేసి ప్రస్తుతం సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తోంది. తెలుగులో ఇదివరకే అనేక సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ రాలేదు.

 రీసెంట్ గా ఈ చిన్నది నటించిన డ్రాగన్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ ఒక్క సినిమాతోనే ఈ భామ పేరు విపరీతంగా మార్మోగిపోతుంది. వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఈ చిన్నదానితో సినిమాలు చేయడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన అందమైన ఫోటోలను తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది. సినిమా అవకాశాల కోసం తన గ్లామర్ డోస్ పెంచుతూ హాట్ గా ఫోటోషూట్లు చేయగా అవి వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ చిన్నదానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారుతుంది.

ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఈ భామతో సినిమాలు చేయడానికి ప్రతి ఒక్క దర్శకుడు కథను సిద్ధం చేసుకుని ముందుకు వెళుతున్నారట. ఇదివరకే ఉన్న హీరోయిన్లను పక్కనపెట్టి ఈ భామను హీరోయిన్ గా ఫైనల్ చేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్టుగా సినీ సర్కిల్స్ లో ఓ వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తోంది. ప్రస్తుతం ఖయాదు లోహర్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపేస్తోంది. వరుసగా సినిమా అవకాశాలు రావడంతో ఈ భామ సంతోషంలో మునిగి తేలుతుందట. ఎవరితో సినిమాలు చేయాలో అర్థం కాలేని పరిస్థితిలో పడిందట. ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు రావడంతో త్వరలోనే సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను ప్రారంభించాలని ప్లాన్ లో ఉన్నారట. ఈ చిన్నది మొదటగా ఏ హీరోతో సినిమా చేస్తుందో అనే సందేహంలో తన అభిమానులు ఉన్నారు. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: