గతంలో యాంకర్ గా తెలుగు బుల్లితెర పైన ఒక వెలుగు వెలిగిన యాంకర్ అనసూయ ఇప్పుడు వెండితెర పైన పలు చిత్రాలలో నటిస్తూ బిజీ యాక్టర్ గా మారిపోయింది. అయితే తాజాగా అనసూయ హైదరాబాద్లో ఒక ఖరీదైన ఇల్లును కొనుగోలు చేసినట్లు నిన్నటి రోజున తన కుటుంబంతో కలిసి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. తన ఇంటికి శ్రీరామ సంజీవని అనే పేరు కూడా పెట్టడం జరిగింది. ఈ విషయాన్ని అనసూయ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ పలు రకాల ఫోటోలను షేర్ చేసింది.


ఈ ఫోటోలు చూసిన పలువురు నేటిజన్స్, అభిమానులు కూడా అనసూయ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వైరల్ గా చేస్తూ ఉన్నారు. తమ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఆ సీతారామాంజనేయ కృపతో మీ అందరి ప్రేమతో మా జీవితంలో మరొక అధ్యాయం పూర్తి అయ్యిందని శ్రీరామ సంజీవని మా ఇంటి కొత్త పేరు అంటూ అనసూయ ఫేస్ బుక్లో, సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసింది. అనసూయ తన భర్త సుశాంత్ ఇద్దరు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించినట్టుగా ఈ ఫోటోలలో కనిపిస్తోంది. అలాగే నూతన గృహంలోకి అడుగుపెట్టినట్టుగా కనిపిస్తోంది.


తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా అనసూయ ఈ దుస్తులలో కనిపిస్తోంది. కొత్త ఇంట్లోకి  ప్రవేశిస్తున్నప్పుడు ఏ ఏ కార్యక్రమాలు చేపడతారో అవన్నీ కూడా అనసూయ చేసినట్టుగా ఈ ఫోటోలలో చూపించింది. అనసూయ కొత్త ఇంటికి గృహప్రవేశానికి తన బంధువులు మాత్రమే హాజరైనట్లుగా తెలుస్తోంది. అలాగే తన అభిరుచులకు ఇష్టంగానే తన ఇంటిని డిజైన్ చేయించుకున్నట్లుగా సమాచారం. అనసూయ చేతిలో ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే ఆరి అనే సినిమాలో నటిస్తూ ఉన్నది. అయితే ఈ సినిమాని పేపర్ బాయ్ డైరెక్టర్ శంకర్ చేస్తున్నారట. స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న పలు షోలలో కూడా అనసూయ జడ్జిగా కనిపిస్తూ ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: