
అయితే ఆతరువాత వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు రాలేదు. అనేకమంది ప్రముఖ దర్శకులు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాలు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆప్రయత్నాలు రకరకాల కారణాలతో ముందుకు సాగలేదు. 1985లో రిలీజైన బాలీవుడ్ మూవీ ‘గిరఫ్తార్’ మూవీలో వీరిద్దరూ కలిసి నటించిన తరువాత మరే సినిమాలోనూ వీరిద్దరూ కలిసి నటించిన సందర్భంలేదు.
ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ తో ‘కూలీ’ మూవీ తీస్తున్న విషయం తెలిసిందే ఈమూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. రెండు సంవత్సరాల క్రితం కమల్ హాసన్ తో ఈ దర్శకుడు తీసిన ‘విక్రమ్’ మూవీ ఘన విజయం సాధించడంతో కమల్ హాసన్ క్రేజ్ మళ్ళీ ప్రారంభం అయింది. ఈ విలక్షణ దర్శకుడు ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్వరలో కమల్ హాసన్ రజనీకాంత్ లతో కలిపి ఒక మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నట్లు లీకులు ఇచ్చాడు.
ఇద్దరు గ్యాంగ్ స్టర్లు వార్ధక్యంలోకి వచ్చాక ఏమి చేస్తారు అనే పాయింట్ మీద ఒక కథ అనుకున్నానని ఆకథ రజనీకాంత్ కమలహాసన్ లకు కూడ బాగా నచ్చింది అని అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే వచ్చే సంవత్సరం ఈమూవీని మొదలుపెట్టి 2027 లో విడుదల చేయాలి అన్న లక్ష్యం తనకు ఉంది అని అంటున్నాడు. క్రేజీ కాంబినేషన్ గా రూపొందబోయే ఈమూవీలో దక్షిణాది సినిమా రంగం బాలీవుడ్ రంగంలోని అనేకమంది నటీనట్లు నటించే ఆస్కారం ఉంది అని అన్నారు..