
ఇదిలా ఉండగా.. రైడ్ పార్ట్ వన్ లో హీరోయిన్ గా ఇలియానా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. హీరోయిన్ ఇలియానా గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ టూ టాలీవుడ్ ఇలియానా అంటే తెలియని వారంటూ ఉండరు. ఈమె ఎన్నో తెలుగు సినిమాలలో నటించి మంచి గుర్తింపును సాధించింది. ఈమె ఆట, రాఖి, భలే దొంగలు, మున్నా, కిక్, నేను నా రాక్షసి, జూలై, దేవుడు చేసిన మనుషులు వంటి సినిమాలలో నటించి మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది.
అయితే ఈ బ్యూటీని రైడ్ 2 సినిమాలో హీరోయిన్ గా డైరెక్టర్ రాజ్ కుమార్ గుప్తా ఎంపిక చెయ్యకపోవడానికి గల కారణాలను తెలిపారు. ఆ స్థానంలో వాణి కపూర్ ని ఎంపిక ఎందుకు చేశారనే దానిపై క్లారిటీ కూడా ఇచ్చారు. ఇలియానా జీవితం పెళ్లి తర్వాత చాలా మారిందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆమెకు ఒక బిడ్డ ఉందని.. అలాగే ఆమె ఇప్పుడు విదేశాలకు వెళ్లిపోయిందని రాజ్ కుమార్ చెప్పారు. అందువల్లే ఆ స్థానంలో వేరే హీరోయిన్ ని తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఇక వాణి కపూర్ విషయానికి వస్తే.. రైడ్ 2లో హీరోయిన్ గా వాణి కపూర్ సరిపోతుందని ఆయన అనుకున్నట్లు తెలిపారు. అనివార్య పరిస్థితుల వల్లే హీరోయిన్ ని మార్చాల్సి వచ్చిందని వెల్లడించారు. అలాగే ఇలియానా ఎప్పటికీ రైడ్ ప్రపంచంలో భాగమేనని స్పష్టం చేశారు. ఇలియానాతో కలిసి రైడ్ వన్ మూవీ చేయడం ఆయనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చారు.