
టాలీవుడ్ లో థియేటర్లు అద్దెల లెక్క మీద కాకుండా ఆదాయం షేర్ చేసుకునే లెక్క మీద నడపాలని ఆంధ్ర - సీడెడ్ - నైజాం లో ఉద్యమం మొదలైన సంగతి తెలిసిందే. ఈ ఉద్యమానికి టాలీవుడ్ పెద్దలు కొందరు మద్దతుగా ఉన్నారు అంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఈ ఉద్యమం ఇప్పుడు నీరుగారి పోయే పరిస్థితి కనిపిస్తోంది. నైజాం ఎగ్జిబిటర్లు షేరింగ్ మీద ఓ పద్ధతి రూపొందించారు. దీని ప్రకారం వసూలు చేసిన గ్రాస్ మీద తొలివారం ఒకలా ... మలివారం ఒకలా .. మూడో వారం మరోలా ఎలా ఆదాయం షేర్ చేసుకోవాలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉదాహరణకు పుష్ప - దేవర లాంటి పెద్ద సినిమాలు తొలివారం పాతికశాతం అమౌంట్ థియేటర్లకు ఇచ్చేయాల్సి ఉంటుంది అంటే ... సుదర్శన్ లాంటి థియేటర్లో తొలివారం 50 లక్షలు వస్తే పెద్ద సినిమాలకు 12 లక్షలు థియేటర్ కు ఇచ్చేయాలి .. ఇప్పుడు ఏడు లక్షలు ఇవ్వాల్సి వస్తోంది. అంటే ఇప్పుడు మరో రు. 5 లక్షలు అదనంగా ఇచ్చుకోవాలి. ఈ మొత్తం నిర్మాతలకు లాస్ కిందే లెక్క.
శ్రీరాములు లాంటి థియేటర్ కు 5 లక్షలకు బదులు ఎనిమిది లక్షల షేర్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు పెద్ద నిర్మాతలు ఎవరు సిద్ధంగా లేరు. అందువలన నిర్మాతలు ఈ పద్ధతికి ససేమేరా ఒప్పుకోరు. అవసరమైతే తమ సినిమాలను కేవలం మల్టీప్లెక్స్ లో రిలీజ్ చేసుకుంటాం లేదా ... అద్దెకు అంగీకరించే థియేటర్లలో మాత్రమే వేసుకుంటాం అన్న లెక్కల్లో వారు ఉన్నట్టు తెలుస్తోంది. సినిమాలో గ్యాప్ ఇచ్చి నిర్మాతలు బతుకుతారు కానీ .. థియేటర్లో మూసుకుని ఎగ్జిబిటర్లు బతకలేరు. శాశ్వతంగా థియేటర్ మూసుకోవడం వేరు నెల రెండు నెలలు మూసేయటం వేరు .. వేల ఖర్చులు భరించాల్సి ఉంటుంది.. అందుకే ఈ ఉద్యమం ఇప్పుడు పూర్తిగా నీరుగారి పోయేలా కనిపిస్తోంది. ఏదేమైనా సింగిల్ థియేటర్ వ్యాపారం పెద్ద బొక్కే అన్న నిర్ణయానికి చాలా మంది ఎగ్జిబిటర్లు వచ్చేస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు