- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పుష్ప ప్రాంఛైజీ 1, 2 లు ఇండియాలో ఎలాంటి విజయాలు నమోదు చేసిందో తెలిసిందే రెండు భాగాలు ఇండియాని షేక్ చేశాయి. పుష్ప 1 , 2 భాగాలు కలిసి రు. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి పాన్ ఇండియాలో సంచలన ఫ్రాంచైజీ గా మారింది. భారతీయ సినిమా పరిశ్రమలో పుష్ప సినిమాలకు ఒక ప్రత్యేకత ఉందని నిరూపించారు హీరో అల్లు అర్జున్ .. ద‌ర్శ‌కుడు సుకుమార్. సినిమా రెండవ భాగంలోని పుష్ప 3 కి సంబంధించిన లీడ్స్ కూడా వదిలారు .. కానీ ఇంకా కథ మాత్రం సిద్ధం కాలేదు. పుష్ప పార్ట్ 2 క్లైమాక్స్‌లో పుష్ప 3 సినిమాకు సంబంధించి లీడ్ ఇచ్చారు అంటే కానీ సినిమాలు ఎలా మొదలు పెట్టాలి ? ఎలా ముగించాలి అన్నది క్లారిటీ లేదు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ సుకుమార్ స్వయంగా తెలిపారు.


ఈ నేపథ్యంలో ఇప్పట్లో పుష్పా 3 సినిమా ఉండదని అందరూ ఓ నిర్ణ‌యానికి వచ్చేసారు. 4 - 5 ఏళ్ల పాటు బన్నీ - సుకుమార్ మరో ప్రాజెక్టు కోసం పని చేయడంతో వాళ్లతో పని చేయాలనుకున్న వాళ్లకు అవకాశం రాకుండా పోయింది. అయితే ఇప్పుడు తాజా అప్డేట్ ప్రకారం పుష్ప 3 స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టినట్లు సమాచారం. ఇప్పటినుంచి మొదలు పెడితే తప్ప పుష్ప 3 స్క్రిప్ట్ పనులు మరో రెండేళ్లకు కానీ పూర్తికావ‌ని .. ఆ తర్వాత సినిమా సెట్స్ మీదకు వెళితే మరో రెండు వేళ్ళు టైం పడుతుందంటున్నారు. ఓవరాల్ గా నాలుగు సంవత్సరాలు తర్వాత కానీ పుష్ప 3 సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. మ‌రి అప్ప‌టి వ‌ర‌కు బ‌న్నీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తారా ?  ఈ అప్‌డేట్స్‌తో ఎంజాయ్ చేస్తారా ? అన్న‌ది చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: