
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న మూడు సినిమాలు ప్రేక్షకుల్లో అంచనాలు బాగా పెంచేస్తున్నాయి. ముందుగా హరిహర వీరమల్లు సినిమా ఆ తర్వాత సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమా. ఈ రెండు సినిమాలకు పూర్తయ్యాక వచ్చేయడాది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. భగత్ సింగ్ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. ఇక హరిహర వీరమల్లు సినిమా ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఈ సినిమాకు ముందుగా ఆ తర్వాత నిర్మాత ఏం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే గత కొన్ని సంవత్సరాలుగా వాయిదాలు పడుతూ వస్తున్న వీరమల్లు సినిమా ఎట్టకేలకు జూన్ 12న రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇది ఇలా ఉంటే వీరమలు క్లైమాక్స్పై దర్శకుడు తో పాటు పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన దృష్టి పెట్టారట. క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం ఆరువారాలపాటు షూటింగ్ చేయగా ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ చాలా కీలకపాత్ర పోషిస్తాయి అని తెలుస్తోంది. ఇలా ఒక క్రేజీ ఎపిసోడ్తో వీరమల్లు క్లైమాక్స్ ఆడియన్స్ కి థియేటర్లలో మంచి ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాపై ఇప్పటివరకు పెద్దగా అంచనాలు లేవు. అయితే సినిమా రిలీజ్ కు టైం దగ్గర పడుతున్న వేళ సినిమాపై అంచనాలు తారాస్థాయికి వెళ్లిపోయాయి. ఏది ఏమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటనేది మరొకసారి ప్రూవ్ అయిందని చెప్పాలి
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు