
నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ లో ఎలాంటి ఫామ్ లో ఉన్నారో అందరికీ తెలిసిందే. ఇక బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 తాండవం సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య హీరోగా నటించిన సినిమాలలో భగవంత్ కేసరి ఒకటి. అనిల్ రావి పూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రీమేక్ చేస్తున్నాడని .... జన నాయగన్ టైటిల్‌తో తెరకెక్కే విజయ్ సినిమా భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ అని ఆల్రెడీ టాక్ ఉంది. వాస్తవానికి ఈ సినిమా లు తమిళంలో విజయ్ హీరోగా అనిల్ రావిపూడి అని రీమేక్ చేయమని కోరినా అది జరగలేదు ...
ఇది ఇలా ఉంటే ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది .. జన నాయగన్ మేకర్స్ కేవలం భగవంత్ కేసరి సినిమా లో గుడ్ టచ్ సన్నివేశం తాలూకు హక్కులు మాత్రమే కొనుక్కున్నారట. మిగిలిన సినిమా అంతా వేరే ఉంటుందని రూమర్లు వినిపిస్తున్నాయి. కేవలం ఈ ఒక్క సీన్ కోసం భారీ మొత్తంలో ఇచ్చి కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రావాల్సి ఉంది. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. .
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు