
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .
సినిమాను థియేటర్లో ఆడించాలి అంటే వచ్చే కలెక్షన్లలో కచ్చితంగా షేర్ ఇవ్వాలి అన్నది ఎగ్జిబిటర్ల డిమాండ్ గా వినిపిస్తోంది. ఇలా చేయకపోతే జూన్ 1 నుంచి ధియేటర్లు బంద్ చేస్తాం అన్నది ఎగ్జిబిటర్ల వార్నింగ్. నిజానికి థియేటర్లను బంద్ పెడతాం అని వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. థియేటర్లో సినిమాను ఎలా ప్రదర్శించాలి ? అసలు ప్రదర్శించాలా వద్దా అన్నది థియేటర్ యజమాని ఇష్టం. దాన్ని ఎవరూ కాదనలేరు. పుష్ప 2 టైంలో హైదరాబాదులో కొన్ని థియేటర్ల పద్ధతులు డిస్ట్రిబ్యూటర్లకు అంగీకారం కాలేదు.. సినిమాలు ఇవ్వలేదు.. పుష్ప 2 ఆ థియేటర్లలో వేయలేదు. దీనికి అసోసియేషన్ తీర్మానం అంత సీన్ అక్కర్లేదు. ఒకరు బంద్ చేస్తే ... ఒకరు వేస్తే ఫలితం ఉండదు. అందరూ కలిసి ముందుకు వెళితేనే ఫలితం ఉంటుంది. థియేటర్ కు సినిమా మీద వచ్చే ఆదాయంలో తమకు ఎంత శాతం ? పొందిన వాటా ఇవ్వాలని థియేటర్ యజమాను అడిగినట్లే తమ సినిమా వేయటం వల్ల తమ సినిమా చూడటం కోసం థియేటర్‌కు వస్తున్న జనాలు ఇచ్చే అదనపు ఆదాయంలో తమకు కూడా వాటా ఉంటుంది కదా ?అని సినిమా నిర్మాత అడిగితే ఏమిటి అన్న ప్రశ్న కూడా ఇప్పుడు తెర మీదకు వస్తుంది.
తమ సినిమా ఆడినందువలన వచ్చే ఆదాయంలో వాటా అడిగినప్పుడు ... అదే సినిమా చూడటం కోసం వచ్చి పార్కింగ్ డబ్బులు , క్యాంటిన్లో ఖర్చు చేస్తే అందులో ఆదాయం తమకు కూడా ఇవ్వాలి కదా అని లా పాయింటు లాగుతున్నారు కొందరు నిర్మాతలు. పర్సంటేజ్ విధానం అన్నది పెద్ద సినిమాలకే సమస్య .. పెద్ద సినిమాలో వస్తే క్యాంటీన్ ఆదాయం , పార్కింగ్ ఆదాయం దండిగా వస్తుంది. అందులో వాటా ఇస్తే నిర్మాతకు పర్సంటేజ్ విధానం వల్ల వచ్చే లాస్ కొంతవరకు కవర్ అయిపోతుంది. పది రూపాయల కూల్ డ్రింక్ అమ్ముతున్నారు.. ప్రతి డ్రింక్ మీద నిర్మాతకు అప్పుడు ఏడు రూపాయలు వస్తుంది.. నాలుగు ఆటలకు కలిపి వందలాది డ్రింకులు అమ్ముతారు.. దీంతో ఆదాయం గట్టిగా వస్తుంది. థియేటర్లో క్యాంటీన్ల ఆదాయం మీదనే ఎక్కువ సంపాదించేది. పెద్ద సినిమాలు ఉంటేనే ఆదాయం వస్తుంది.. ఇప్పుడు అదే పెద్ద సినిమాలు ఆదాయాన్ని పర్సంటేజ్ గా కోరుకుంటున్నారు. అప్పుడు నిర్మాతలు ఇలా అదనపు ఆదాయంలో వాటా కొరితే ఈ గొడవ మరో టర్న్ తీసుకుంటుంది అనటంలో సందేహం లేదు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు