
ఏపీ , తెలంగాణలో రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో తమకు ఆదాయం పంపిణీ చేయకపోతే థియేటర్లు బంద్ చేస్తామని ఇప్పటికే ఎగ్జిబిటర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇప్పుడు హైదరాబాదులో వరుసగా అటు నిర్మాతలు .. ఇటు పంపిణీదారులు ఎగ్జిబిటర్లు సమావేశం అవుతున్నారు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇటీవలే నాని నటించిన హిట్ 3 సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అని ఒకటే ప్రచారం చేశారు. అందుకు తగినట్టుగా వసూళ్లు వచ్చాయని చెప్పుకున్నారు. తీరా చూస్తే తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమా పంపిణీ చేసిన పంపిణీదారులకు కనీసం 50 లక్షలు నష్టం వస్తుందని అదే జిల్లాకు చెందిన మరో ప్రముఖ పంపిణీ దారుడు సత్యనారాయణ తన తాజా ఇంటర్వ్యూలో తెలిపారు.
అలాగే ఇటీవల ఓ యంగ్ హీరో నిర్మించిన మిడ్ రేంజ్ సినిమా విడుదలైంది. ముందుగా 50 - 50 % విధానంలో ఆ హీరో , పంపిణీ దారుడు కలిసి ఎగ్జిబిటర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తొలి రోజు ఆటకు 4 లక్షల చొప్పున వసూలు వచ్చాయి. ఒప్పందం ప్రకారం చెరో రెండు లక్షలు తీసుకోవాలి. కానీ వసూళ్లు ఎక్కువగా వచ్చే సరికి కేవలం లక్ష చేతిలో పెట్టి 3,00,000 డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నారు. ఎగ్జిబిటర్ చేసేదేం లేక సైలెంట్ అయిన పరిస్థితి. గట్టిగా మాట్లాడితే తర్వాతి సినిమా ఇస్తారో ? ఇవ్వరో అన్న బాధ ఎగ్జిబిటర్లలో కనిపిస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు