
అయితే ఆస్తి విషయంలోనే మంచు ఫ్యామిలీలో విభేదాలు తలెత్తాయని గతంలో ప్రచారం జరిగింది. ఈ విషయంపై తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మంచు మనోజ్ నోరు విప్పాడు. నేను ఆస్తి అడిగానా..? దమ్ముంటే అడిగినట్లు నిరూపించండి అంటూ మనోజ్ సవాల్ విసిరాడు. ఇంతవరకు తాను ఆస్తి అడగలేదని ఆయన స్పష్టం చేశారు. నింద వేసి వాటిని నిజమని అంగీకరించమంటే నా వల్ల కాదని.. తప్పు చేస్తే నేనే దాక్కొంటాను.. కానీ నేను ఏ తప్పు చేయలేదు అంటూ మనోజ్ పేర్కొన్నారు.
అలాగే భూమా మౌనికను పెళ్లి చేసుకోవడం వల్లే మనోజ్ తో మంచు విష్ణు, మోహన్ బాబుకు మనస్పర్ధలు ఏర్పడినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ గొడవలకు మౌనికకు ఎటువంటి సంబంధం లేదని తాజాగా మనోజ్ తేల్చేశాడు. లైఫ్ లో మౌనిక ఎన్నో కష్టాలు ఎదుర్కొందని.. చిన్న వయసులోనే తల్లిదండ్రులు కోల్పోయిందని మనోజ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.
ఇంకా మాట్లాడుతూ.. `మా నాన్న మోహన్ బాబు అంటే నాకెంతో ఇష్టం. ఆయనపై ఎటువంటి కోపం లేదు. నా కూతురుని ఆయన ఎత్తుకుంటే చూడాలని ఉంది. గొడవలు పడకుండా కూర్చుని సమస్యలు పరిష్కరించుకోవాలనే నేనూ అంటున్నాను.. కుటుంబ సభ్యులందరం మళ్ళీ కలిసి భోజనం చేసే రోజు రావాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను` అంటూ మనోజ్ భావోద్వేగానికి గురయ్యారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు