- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

టాలీవుడ్ లో ప్రస్తుతం థియేటర్లో బంద్‌ వ్యవహారం ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దీనిపై విచారణకు ఆదేశించడంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో ముసలం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్ లో ఆ నలుగురు అని విమర్శలు ఎదుర్కొంటున్న వారు ఒక్కొక్కరు బయటకు వచ్చి తమకు ఈ విషయంలో సంబంధం లేదని చెప్పేస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీకి చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ రాజమహేంద్రవరం నగరపార్టీ ఇన్చార్జిగా ఉన్న అత్తి సత్యనారాయణ ను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో సింగిల్ స్క్రీన్ ధియేటర్ల ఓనర్లు బలైపోతున్నారా ? అసలు నిజాలు ఏమిటి అన్నదానిపై ఆసక్తికర చర్చలు వినిపిస్తున్నాయి. మల్టీప్లెక్స్ లలో రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి. అదనపు షోలకు అనుమతులు ఉంటున్నాయి. అక్కడ నిర్మాతలు షేరింగ్ పద్ధతిలో ఆదాయం తీసుకుంటున్నారు. సింగల్ స్క్రీన్ ధియేటర్ల వద్దకు వచ్చేసరికి ముందుగానే భారీ అడ్వాన్సులు ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.


ఉదాహరణకు గోదావరి జిల్లాలో సి సెంటర్లలో కూడా ఒక స్టార్ హీరో సినిమాకు పది లక్షల వరకు సింగల్ స్క్రీన్ థియేటర్ల ఓనర్లు అడ్వాన్సులు ఇస్తున్నారు. సినిమా హిట్ అయితే పెద్దగా వచ్చే లాభాలు ఉండటం లేదు. అదే సినిమాకు ప్లాప్టాప్ వస్తే రిలీజ్ రోజు మార్నింగ్ షోకే థియేటర్లో జనాలు ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఒక్కో సినిమాకు ఐదారులక్షల వరకు నష్టపోతున్నారు. సినిమా ఎంత పెద్ద హిట్ అయినా రెండు మూడు లక్షల మించి లాభాలు రావటం లేదు. దీంతో బీ , సీ సెంటర్లలో సింగల్ స్క్రీన్ ఓనర్లు థియేటర్లు నడపలేని పరిస్థితులు వచ్చేసాయి. చిన్న సినిమాలకు 50 - 50 % ఇచ్చిన గట్టిగా 1,2 లక్షలకి మించి కలెక్షన్లు రావడం లేదు.


అదే పెద్ద సినిమాలకు 15 లక్షల వరకు కలెక్షన్లు వచ్చినా రెంటల్‌ పద్ధతిలో ఇవ్వడంతో లక్షకు మించి రెవెన్యూ రాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో పెద్ద సినిమాలకు ఎక్కువ ఆదాయం వస్తున్న తమకు మిగిలేది ఏం ఉండటం లేదంటున్నారు. చిన్న సినిమాలుకు పర్సంటేజ్ అంటున్న తక్కువ కలెక్షన్లు రావడంతో పాటు ఒక్కోసారి షేర్ ఏమీ లేకపోవడంతో నష్టాలతో థియేటర్లను నెట్టుకు వస్తున్నామని.. అందుకే పెద్ద సినిమాలు కూడా పర్సంటేజ్ ఇవ్వాలని బీ, సీ సెంటర్లలో సింగల్ స్క్రీన్ థియేటర్లు ఓనర్లు డిమాండ్ చేస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: