
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ సినిమా కూలీ. ఈ సినిమా కోసం అటు రజనీకాంత్ అభిమానులతో పాటు ... ఇటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. విజయ్ లియో తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీతో రజిని బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేయటం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. . ఈ సినిమా కోసం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లోను భారీగా ఆసక్తి నెలకొంది. దీంతో ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. సినిమాపై నెలకొన్న భారీ అంచనాలతో ఈ సినిమా రైట్స్ దక్కించుకునేందుకు భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం.
ఓవర్సీస్ రైట్స్ కోసం ఏకంగా రు . 80 కోట్ల మేర ఆఫర్ వచ్చాయంటే కూలీ క్రేజీ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ విషయంలో మేకర్స్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదట. ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. రజనీ - నాగార్జున .. అటు లోకేష్ కనగరాజ్ లాంటి సూపర్ కాంబినేషన్ కావడం తో కూలీకి ఏపీ , తెలంగాణ లో నూ భారీ డీల్స్ నడుస్తున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు