గత కొద్ది రోజుల నుండి కమల్ హాసన్ మాట్లాడిన వ్యాఖ్యలపై కన్నడ ఇండస్ట్రీలో ఎంత పెద్ద దుమారం చెలరేగుతుందో చెప్పనక్కర్లేదు.ఆయన థగ్ లైఫ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కర్ణాటక లోని థగ్ లైఫ్ మూవీ ప్రమోషనల్ ఈవెంట్ లో కన్నడ భాష తమిళం భాష నుండి పుట్టింది అని మాట్లాడి కన్నడ ప్రజల ఆగ్రహ జ్వాలకు గురయ్యారు. కమల్ హాసన్ ఈ మాటలు మాట్లాడినప్పటినుండి కన్నడ ఇండస్ట్రీ లో ట్రోలింగ్ కి గురవుతున్నారు.ముఖ్యంగా కమల్ హాసన్ మాట్లాడిన మాటలని వెనక్కి తీసుకుని క్షమాపణలు చెబితేనే కన్నడలో థగ్ లైఫ్ మూవీ విడుదలవుతుంది.లేకపోతే సినిమాని కన్నడ లో నిషేధిస్తాం అని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున థగ్ లైఫ్ మూవీ బ్యాన్ పై వార్తలు వస్తున్నాయి. 

ఈ నేపథ్యంలోనే తాజాగా గాడిదలకు ఎక్కువగా విలువ ఇవ్వకూడదు అంటూ సంచలన పోస్ట్ చేసింది కన్నడ నటి రమ్య. అయితే కన్నడ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ అయినప్పటికీ రమ్య కమల్ హాసన్ మాటలకే సపోర్ట్ ఇచ్చింది.. ఆయన పెద్ద నటుడు.. ఆయన్ని విమర్శించడం మంచిది కాదు. ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటలకు సినిమాను నిషేధించడం అనేది అతిశయోక్తి అంటూ చెప్పుకొచ్చింది.అంతేకాదు ఎవరి భాష వారికి గొప్ప అని, ఒక భాష కంటే మరొక భాష గొప్పేమీ కాదు అని, కమల్ హాసన్ మాట్లాడిన మాటలు తప్పే కానీ ఆయన సినిమాను బ్యాన్ చేయడం అతిశయోక్తి అని చెప్పడంతో కన్నడ వ్యాప్తంగా నటి రమ్య మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కన్నడ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ కన్నడ భాషను తక్కువ చేసి మాట్లాడితే వ్యతిరేకించాల్సింది పోయి సమర్థిస్తున్నావా అంటూ రమ్యని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోలింగ్ ని ఉద్దేశించి తాజాగా రమ్య గాడిదలకు ఎక్కువగా విలువ ఇవ్వకూడదు అంటూ ఒక షాకింగ్ పోస్ట్ పెట్టింది. మీ విలువైన టైం ని వృధా చేసే చెత్త మార్గం ఏంటంటే వాస్తవం ఏంటో తెలియకుండా మాట్లాడే మూర్ఖుడు.. అర్థం లేని వాదనల గురించి మాట్లాడడం.. ఆ వాదనలో పాల్గొనకపోవడమే మంచిది కాదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే రమ్య చేసిన ఈ పోస్ట్ ఆమెపై ట్రోలింగ్ చేసే వారికి కౌంటర్ గా పెట్టినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: