సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం ఖలేజా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి అయినటువంటి అనుష్క శెట్టి , మహేష్ కి జోడిగా నటించగా ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్మూవీ కి దర్శకత్వం వహించాడు. మణిశర్మమూవీ కి సంగీతం అందించగా ... ప్రకాష్ రాజ్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. బ్రహ్మానందం , కోట శ్రీనివాసరావు , సునీల్ , అలీ , రావు రమేష్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని ఆదుకోలేదు. ఇక ఈ మూవీ ని మే 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో భాగంగా ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తూ అనేక కొత్త కొత్త రికార్డులను సృష్టిస్తుంది. ఇకపోతే తాజాగా రీ రిలీజ్ లో బాగంగా ఈ మూవీ సరికొత్త రికార్డును సృష్టించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ మూవీ కూడా పది కోట్ల కలెక్షన్లను రీ రిలీజ్ లో వసూలు చేయలేదు. ఆ రికార్డును ఖలేజా మూవీ సాధించింది. మూడు రోజుల్లో ఈ మూవీ 10 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ మూవీ కి 3 రోజుల్లో ఏ ఏరియాలో ఎన్ని కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఎన్ని కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూడు రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 5.01 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 53 లక్షలు , ఆంధ్ర లో 2.66 కోట్ల కలెక్షన్లు దక్కాయి. కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 70 లక్షలు , ఓవర్సీస్ లో 1.20 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా మూడు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 10.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇలా ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్లను రీ రీలీజ్ లో భాగంగా ఖలేజా మూవీ వసూలు చేసి కొత్త రికార్డును సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: