
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన హరి హర వీరమల్లు సినిమా మరోసారి వాయిదా పడిందా. జూన్ 12న థియేటర్లలోకి రావడం లేదా ? ఇప్పటికే నాలుగేళ్ల పాటు నిర్మాణంలో ఉన్న ఈ సినిమా ఇద్దరు దర్శకులు మారినా .. బడ్జెట్ అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఖర్చు చేసిన మరోసారి వాయిదా పడిందని వార్తల రావటం వెనక అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. వీరమల్లు జూన్ 12న థియేటర్లలోకి రాదని వాయిదా పడిందని ... బలమైన ప్రచారం జరుగుతోంది. ఇంకా సెన్సార్ ముందుకు సినిమా వెళ్లలేదని అంటున్నారు. వాస్తవానికి జూన్ 3న సెన్సార్ జరగాలి. అయితే సినిమా ఇంకా పూర్తి కాలేదు అని అంటున్నారు. టెక్నికల్ రీజన్స్ తో పాటు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతుందని సమాచారం. ఈ సినిమా నిర్మాణానికి నాలుగేళ్లు పట్టింది. ఆ విషయం అందరికీ తెలుసు. బడ్జెట్ పక్కన పెడితే వడ్డీలు తడిసి మోపెడు అయ్యాయి.
ఫైనాన్షియర్లకు బాకీలు క్లియర్ చేస్తే తప్ప విడుదలకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వరు. ఫ్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయితే వాళ్లకు ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే వీరమల్లు ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఇంకా పూర్తి కాలేదు. నిర్మాత చెప్పేరేట్లకు డిస్ట్రిబ్యూటర్లు కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నారు. ఇటీవల సినిమా విడుదలకు ముందు ఆ నలుగురు కుట్ర చేశారని వచ్చిన వార్తలపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రైలర్ రిలీజ్ అయితే బిజినెస్ క్లోజ్ అవుతుందని నిర్మాత రత్నం నమ్మకంతో ఉన్నారు. అయితే నిర్మాత అడిగిన రేట్లు రావాలంటే ముందు ట్రైలర్ రిలీజ్ కావాలి. రత్నం చేతిలో మరో సినిమా లేకపోవడంతో వీరమల్లు సినిమాకు ఆయన అడిగిన రేట్లు ఇవ్వటానికి డిస్ట్రిబ్యూటర్లు వెనకడుగు వేస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే సినిమా ఏదైనా తేడా కొడితే మరో సినిమా చేస్తానని నిర్మాత రత్నానికి పవన్ అభయం ఇచ్చాడట. మరి వీరమల్లు రిలీజ్ విషయంలో ఫైనల్ గా ఏం జరుగుతుందో ? చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు