
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడినట్టే. అయితే తర్వాత రిలీజ్ డేట్ ఎప్పుడు ? అన్నది ప్రశ్న. తర్వాత ఈ నెల 27న వస్తుందా ?జూలై 4 ని విడుదల చేస్తారా ఇవన్నీ ప్రశ్నలే. కానీ ఎక్కడ సినిమా అక్కడ ఉంది. అక్కడ ఉన్న సినిమాలు వెనక్కి జరిగితే తప్ప హరిహర వీరమల్లు సినిమాను రిప్లేస్ చేయడం కుదరదు. 27 కన్నప్ప ఉంది .. తాను వెనక్కి వెళ్ళేది లేదని విష్ణు చెబుతున్నారు. 20న ధనుష్ - నాగార్జున కుబేర ఉంది. అది ఏసియన్ సునీల్‌ది. ఇక నాలుగున సితార సంస్థ కింగ్‌డమ్ ఉంది. ఒకవేళ పవన్ కోసం ఒక వారం త్యాగం చేస్తారు అనుకున్న 11న యువీ వాళ్ళ అనుష్క ఘాటీ సినిమా ఉంది. ఒకవేళ కింగ్డమ్ మరో వారం వెనక్కి వెళ్లి 18న రిలీజ్ అవ్వాలి.. అప్పుడు ఆ సినిమాకు చాలా నష్టం జరుగుతుంది. అందువల్ల హరిహర వీరమల్లు సినిమానే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వచ్చే నెల 18 కి వెళ్ళిపోవాలి లేదా కుబేరను ఇబ్బంది పెట్టాలి.
ఇప్పుడు ఈ రెండు ఆప్షన్లే ఉన్నాయి. రిలీజ్ డేట్ సంగతి ఇలా ఉంటే సీడెడ్ కాకుండా ఆంధ్ర ఏరియాకే 40 నుంచి 45 కోట్ల రేంజ్ లో అయితే బయ్యర్లు రెడీ గానే ఉన్నారు. అంతకుమించి రావటం అనుమానమే. రెండు రాష్ట్రాల మీద కలిపి 100 కోట్ల వరకు అడ్వాన్సులు లాగా వచ్చు. థియేటర్ రైట్స్ మీద క్లియర్ చేయాల్సిన బాకీలు చాలా ఉన్నాయి. రత్నం నుంచి మరో సినిమా లేకపోవడం .. ఆయన కంటిన్యూగా సినిమాలు చేస్తారో చేయరు అన్న క్లారిటీ లేకపోవడంతో ఇవన్నీ కలిసి బయ్యర్లను ఈ సినిమాకు దూరంగా ఉంచుతున్నాయి. ఈ సమస్యలు అన్ని తీరాలి అంటే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి మైత్రి , సితార లాంటి వాళ్లకు ఒక్క మాట చెబితే చాలు..! మరి పవన్ రంగంలోకి దిగుతారా అన్నది చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు