
అడివి శేష్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ 'డకాయిట్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫైర్ గ్లింప్స్ ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్ తో అదిరిపోయింది. నేషనల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది .. అడవి శేష్ సినిమా లు అంటే ఇప్పుడు నేషనల్ వైడ్ గా మంచి అంచనాలు ఉన్నాయి. విజువల్ గా ఫైర్ గ్లింప్స్ కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా అడివి శేష్ డకాయిట్ కోసం డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేశారు. దీనికి సంబధించిన ఫోటోని షోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే టీం జూన్ 8 నుంచి క్రూషియల్ షూటింగ్ షెడ్యూల్ ని ప్రారభించనున్నారు. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. .
ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ నిర్మాతగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ఈ క్రిస్మస్, డిసెంబర్ 25 న గ్రాండ్ థియేట్రికల్ విడుదల కానుంది. ఈ హాలిడే బాక్సాఫీస్ ను షేక్ చేస్తొందని చెప్పడం ఎలాంటి సందేహం లేదు. శేష్‌కు ఇది తొలి హాలిడే రిలీజ్ కావడం విశేషం ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు