
మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గత ఏడాది సంక్రాంతికి మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంచనాలు అందుకోలేదు. ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమా కోసం దాదాపు ఏడాదిన్నర కాలంగా వేచి చేస్తూ వస్తున్నారు. పుష్ప 2 అంచనాలకు మించి హిట్ అవడంతో ఇప్పుడు బన్నీ ... త్రివిక్రమ్ ను కాదని తమిళ దర్శకుడు అట్లీ తో సినిమా చేస్తున్నారు. ఈ క్రమంలోనే తనకు సరైన హీరో ఎవరు దొరుకుతారో ? అని కొంతకాలంగా ఎదురు చూపులు చూసిన త్రివిక్రమ్ ఇప్పుడు ఒకేసారి ముగ్గురు హీరోలను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.
ఒక సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసేందుకు రెడీ అవుతున్నారు. అంతకంటే ముందు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో ఓ సినిమా ప్లాన్ చేశాడు. ఈ రెండు సినిమా లతో పాటు హీరో రామ్ తో కూడా మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూడు సినిమా ల ను త్రివిక్రమ్ లైన్లో పెడుతున్నారు. ఈ మూడు సినిమాలు పూర్తయ్యే సరికే మరో నాలుగైదేళ్లు ఈజీగా పడుతుంది. ఇక ఆ తర్వాత బన్నీ - త్రివిక్రమ్ సినిమా ఉంటుందేమో ? చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు