- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుల్లో తరుణ్ భాస్కర్ కూడా ఒకరు .. పెళ్లిచూపులు సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమ లో అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించి .. రెండో సినిమా ఈ నగరానికి ఏమైంది అంటూ యూత్ ను బాగా ఆకట్టుకున్నారు .. విశ్వక్ సేన్ , అభినవ్ గోమటం , వెంకటేష్ కాకుమాను , సుశాంత్ రెడ్డి కీలక పాత్రలో నటించిన సినిమా ఈ తరహా కొత్త కథ తో ప్రేక్షకులను ఇంతగానో మెప్పించాడు ..  ఇక ఈ సినిమాకు ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉన్నారు . ఆ ఓటీటీలో అయితే ఈ సినిమా కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది .. అయితే ఈ సినిమా ను కూడా  ఖలేజా తరహా లోనే మొదటిసారి థియేటర్స్ లో రిలీజ్ చేసినప్పుడు అంత సక్సెస్ కాలేదు ..   కానీ రీరిలీజ్ లో మాత్రం  భారీ కలెక్షన్లు రాబట్టింది ..

అందుకని ఇప్పుడు ఈ సినిమా అభిమానుల కోసం తరుణ్ భాస్కర్ సీక్వెల్ ను రెడీ చేస్తున్నారు .. దీనికోసం కూడా చాలా మంది ఎంతోకాలంగా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు తాజాగా తరుణ్ భాస్కర్ సోషల్ మీడియా లో విడుదల చేసిన పోస్ట్ ఇప్పుడు మరింత ఆస్తిని పెంచేసింది .. తాజాగా తరుణ్ ది అండ్ అంటూ ఒక పిక్‌ను తన లాప్టాప్ పై తీసి సోషల్ మీడియాలో పెట్టాడు .. దీంతో ఇది ఈ నగరానికి ఏమైంది 2 స్క్రిప్ట్ కోసమే అని అందరికీ క్లారిట వచ్చేసింది .. ఈ పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ఈ పోస్ట్ పై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు .. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కావాలని కూడా అంటున్నారు .. అలాగే ఈ సినిమా పై మాత్రం ఇప్పుడు గట్టి అంచనాలే ఉన్నాయి .

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు ..




మరింత సమాచారం తెలుసుకోండి: