
కుమారస్వామి , సుబ్రహ్మణ్యస్వామి , కార్తికేయ ఇలా ఏ పేరుతో పిలిచిన సరే ఆయన రూపం కనిపిస్తుంది .. అయితే ఇక్కడ ఈ కథను త్రివిక్రమ్ ఎలా రాసుకున్నారు .. స్కంద పురాణం లో ఏ అంశాలను తెరపై చూపించబోతున్నారనేది ఇప్పుడు ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిగా మారింది . అయితే ఇప్పుడు ఎన్టీఆర్ , త్రివిక్రమ్ సినిమా ఈ సంవత్సరం మొదలవుతుంది అనుకుంటే .. అది కాస్త వచ్చే సంవత్సరానికి మారినట్టు తెలుస్తుంది .. ఈలోగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాను కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది .. అలాగే మరో పక్క త్రివిక్రమ్ కూడా వెంకటేష్ తో ఒక సినిమా చేసే పనిలో ఉన్నాడు .. ఇలా ఈ ఇద్దరు కూడా ఎవరికి వారు తమ ప్రాజెక్టులు పూర్తి చేశాకే కలిసి ఈ భారీ సినిమా అను మొదలుపెట్టే అవకాశం ఉన్నట్టు తెలిసింది ..
అలాగే ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేస్తున్న ఈ మైథాలజీ స్టోరీ కూడా మరో లెవల్‌లో ఉండబోతుందని కూడా క్లారిటీ వస్తుంది . ఎన్టీఆర్ అంటేనే ఎలాంటి క్యారెక్టర్ అయినా ఈజీగా చేసే దమ్మున్న హీరో అని అంటారు .. ముఖ్యంగా ఈ తరం హీరోలలో పౌరాణిక పాత్రలు చేసి మెప్పించాలంటే మొదట ఎన్టీఆర్ పేరే అందరికీ గుర్తుకు వస్తుంది .. అలాంటిది ఆయనతో త్రివిక్రమ్ చేయబోతున్న ఈ ప్రాజెక్టు అయితే తెలుగు సినీ ప్రేక్షకులకు నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని కూడా అంటున్నారు .. ఈ సినిమాకు కథ కూడా త్రివిక్రమ్ ఎంతో కష్టపడి రెడీ చేసినట్టు తెలుస్తుంది .. అలాగే ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కోసం ఇప్పటినుంచే రెడీ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది .. ఇప్పటికే ఎన్టీఆర్ మురుగన్ పుస్తకం తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .. ఇక దీంతో ఎన్టీఆర్ , త్రివిక్రమ్ సినిమా కోసం ఇప్పటినుంచే తన్ను తాను ప్రిపేర్ చేసుకుంటున్నాడు .. ఇక మరి గురూజీ అసలు సత్తా ఏంటన్నది ఈ మూవీ ప్రూవ్ చేస్తుందేమో చూడాలి.