యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఇటీవలే `తండేల్` మూవీతో బిగ్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. కెరీర్ లోనే తొలిసారి ఈ చిత్రంతో చైతు 100 కోట్ల క్లబ్లో చేరాడు. ప్రస్తుతం కార్తిక్‌ వర్మ దండు దర్శకత్వంలో చైతు తన 24వ‌ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాడు. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. సమంతతో విడాకులు తీసుకున్న కొంతకాలానికే నాగ చైత‌న్య ప్రముఖ నటి శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమ పెళ్లికి దారితీసింది.


గత ఏడాది డిసెంబర్ 4న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నాగచైతన్య, శోభిత ఏడడుగులు వేశారు. వివాహం అనంతరం ఈ స్టార్ కపుల్ హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అయితే తాజాగా మ్యాన్స్ వరల్డ్ ఇండియా తో మాట్లాడిన చైతు భార్య శోభిత గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. శోభితతో రోజు బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ ను షేర్ చేసుకుంటానని.. సండే వస్తే మూవీ చూడడం, ఫుడ్ ఆర్డర్ చేయడం, కలిసి వాకింగ్‌కు వెళ్లడం చేస్తామని చైతు చెప్పుకొచ్చాడు.


అలాగే శోభితకు రేస్ ట్రాక్ లో డ్రైవింగ్ నేర్పించానని.. ఆమె డ్రైవింగ్ చేయడం స్టార్ట్ చేశాక ఆపడానికి ఏమాత్రం ఇష్టపడలేదని చైతు తెలిపాడు. ఇక‌ మీరు ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తారు? అనే ప్రశ్న ఎదురైనప్పుడు.. `నేను ఆరాధించే వారిలో మా నాన్న, అమ్మ‌ తొలి రెండు స్థానాల్లో ఉంటారు. మూడో స్థానం నా భార్యది` అంటూ నాగ చైత‌న్య చెప్పుకొచ్చాడు. శోభిత కన్నా నాన్న నాగార్జున, అమ్మ లక్ష్మి నే ఎక్కువని చైతు ఒక్క మాటలో తేల్చేశాడు. ప్రస్తుతం అత‌ని కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: