
ముఖ్యంగా `గేమ్ ఛేంజర్` సినిమాకు సంబంధించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ఉద్దేశిస్తూ శిరీష్ చేశారని వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ దిల్ రాజు, శిరీష్ ల కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. భారీ నష్టాలను మిగిల్చింది. అయితే గేమ్ ఛేంజర్ రిలీజ్ తర్వాత హీరో రామ్ చరణ్ కానీ, డైరెక్టర్ శంకర్ కానీ కనీసం ఫోన్ కూడా చేయలేదని శిరీష్ కొద్దిపాటి అసహనం వ్యక్తం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు మెగా ఫాన్స్ ను తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి.
ఆ తర్వాత దిల్ రాజు వివరణ ఇవ్వడం, శిరీష్ కూడా దిగివచ్చి మెగా ఫాన్స్ కు క్షమాపణ చెప్పడం తెలిసిందే. ఈ సంగతి పక్కన పెడితే ఇప్పుడు దిల్ రాజు, శిరీష్ గురించి మరో టాప్ సీక్రెట్ బయటపడింది. చూడడానికి ఒకేలా కనిపించడంతో దిల్ రాజు, శిరీష్ సొంత బ్రదర్స్ అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. దిల్ రాజు ఫాదర్, అలాగే శిరీష్ ఫాదర్ అన్నదమ్ములు. అయితే చిన్నతనం నుంచి ఉమ్మడి కుటుంబంగా ఉండడం.. ఒకే దగ్గర కలిసే పెరగడంతో తల్లిదండ్రులు వేరైనా కూడా దిల్ రాజు, శిరీష్ మధ్య సొంత బ్రదర్స్ లాంటి బాండింగ్ ఏర్పడిందట. ఇకపోతే ఓన్ గా దిల్ రాజ్‌కు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వారిద్దరూ ఆటోమొబైల్స్ బిజినెస్ ను చూసుకుంటారట.