త్రివిక్రమ్ ..ఈ పేరు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు.  ఎంతోమంది స్టార్ డైరెక్టర్ లు ట్రెండ్ కి తగ్గట్టు ఫాలో అవుతూ ఉంటారు.  కానీ త్రివిక్రమ్ మాత్రం తనకి ఇష్టమైన సెంటిమెంట్ నే నమ్ముకుంటూ ఉంటాడు.  ఎంత టెక్నాలజీ పెరిగిపోయినా .. ఎన్ని అత్యాధునిక ఎక్విప్మెంట్స్ వచ్చిన తన సినిమాలకు పాత పద్ధతిని ఫాలో అవుతూ ఉంటాడు త్రివిక్రమ్ . ఈ విషయం త్రివిక్రమ్ తో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు . కాగా ప్రజెంట్ త్రివిక్రమ్ - వెంకటేష్ తో తెరకెక్కించే సినిమా పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు.  మనకు తెలిసిందే అల్లు అర్జున్ తో ఒక ప్రాజెక్టు కమిట్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు-  అల్లు అర్జున్ వేరే ప్రాజెక్టులో  బిజీ అవడంతో ఆ ప్రాజెక్టు ని ఎన్టీఆర్ కి ఫిక్స్ చేశారు .


మురుగన్ సినిమా తో మరొక సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు త్రివిక్రమ్ అంటూ సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు.  డ్రాగన్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు తారక్. ఈ డ్రాగన్  సినిమా షూట్ అయిపోయాక దేవర 2 ని సెట్స్ పై కి తీసుకొస్తారు . ఆ తర్వాత "మురుగన్" సినిమా సెట్స్ పైకి వస్తుంది అంటూ తెలుస్తుంది. ఈ గ్యాప్ టైం వేస్ట్ చేసుకోకుండా వెంకటేష్ తో ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్ మెంట్ సినిమాని  తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్.  అయితే ఈ సినిమా కోసం క్రేజీ టైటిల్ ని ఫిక్స్ చేసుకున్నారు అని టాక్ బయటకు వచ్చింది .



ఇది వెంకటేష్ కి  77వ సినిమా.  అధికారికంగా ప్రకటించకపోయిన ఈ ప్రాజెక్టు సైలెంట్ గా సెట్స్ పైకి  తీసుకెళ్లేందుకు సన్నహాలు చేస్తున్నారు మేకర్స్.  కాగా ఈ సినిమాకి " వెంకటరమణ " అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట . అంతేకాదు ట్యాగ్ లైన్ గా "కేరాఫ్ ఆనంద నిలయం" అని ఈ విధంగా పెట్టబోతున్నారట.  త్రివిక్రమ్ సినిమా టైటిల్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి.  అలా వైకుంఠపురంలో , అత్తారింటికి దారేది,  గుంటూరు కారం , సన్నాఫ్ సత్యమూర్తి ఇలా ప్రతి టైటిల్ లోను తన టాలెంట్ చూపిస్తూ ఉంటాడు త్రివిక్రమ్.  ఇప్పుడు వెంకటేష్ తో తెరకెక్కించే సినిమా కోసం వెంకటరమణ కేర్ అఫ్ ఆనంద నిలయం అనే  టైటిల్ చూస్ చేసుకున్నారట.  తన హిట్ సెంటిమెంట్ నే ఫాలో అవుతూ ఈ టైటిల్ పెట్టబోతున్నారు అంటూ తెలుస్తుంది.  ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినట్లుటాక్  బయటకు వచ్చింది . దీనితో టైటిల్ తోనే సగం హిట్ కొట్టేసాడు పో త్రివిక్రమ్ అంటున్నారు వెంకి అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: