
ఒక్క నైజాం ఏరియాకే రు. 65 కోట్లు చెపుతున్నారట. ఇది ట్రిపుల్ ఆర్ బిజినెస్ కంటే ఎక్కువ. పవన్ ఎంత పెద్ద హీరో అయినా త్రిబుల్ ఆర్ రేంజ్‌లో ఈ సినిమా నైజాంలో వసూళ్లు రాబడుతుందా ? అంటే ఎంత పెద్ద హిట్ టాక్ వచ్చినా డౌటే. ఇక ఏపీలో సీడెడ్ కాకుండా రు. 80 కోట్లు చెపుతున్నారట. వైజాగ్ ఏరియాకు రు. 20 కోట్లు చెపుతున్నారట. ఇక ఏపీలో రు. 80 కోట్లు అంటే... వైజాగ్‌కు రు. 20 కోట్లు అంటే ఈస్ట్, వెస్ట్, కృష్నా, గుంటూరు, నెల్లూరు ఐదు ఏరియాలకు కలిపి రు. 60 కోట్లు రావాలి... అంటే ఒక్కో ఏరియాకు సగటున రు. 12 కోట్లు రావాల్సి ఉంటుంది. నెల్లూరు చిన్న ఏరియా.. ఈ లెక్కన గుంటూరు, ఈస్ట్‌కు రు. 14 - 15 కోట్ల రేషియో చెప్పాల్సి ఉంటుంది.
ఈ ఫిగర్లు చూస్తుంటే చాలా ఎక్కువుగా కనిపిస్తున్నాయి. ఇది పవన్‌కు కూడా పెద్ద టార్గెట్టే. ఈ మొత్తాలు రికవరీ కావాలంటే సినిమాకు మంచి టాక్ రావాలి. వీరమల్లు మీద ముందు నుంచి పెద్దగా అంచనాలు లేవు. ఎప్పుడు అయితే ట్రైలర్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి సినిమాపై హైప్ పెరిగింది. ఇప్పుడు ప్రమోషన్లు బాగా చేసుకుని.. మంచి ఓపెనింగ్స్‌తో పాటు సినిమాకు హిట్ టాక్ వస్తే రికవరీ కష్టం కాదు. అయితే ఇప్పుడు వీరమల్లుకు మరో చిక్కు వచ్చి పడింది. ఈ సినిమా వచ్చిన వారం రోజులకే విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ రిలీజ్ డేట్ వేశారు. ఎంత పెద్ద హిట్ అయినా వారం రోజుల్లో ఇంత పెద్ద మొత్తాలు రివకరీ కావు. అందుకే వీరమల్లు రేట్లు.. వీరమల్లు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలను టెన్షన్ పెట్టేస్తున్నాయి.