ఒక హీరోయిన్ అందంగా ఉండడమే ఆమెకి ప్లస్ అనుకుంటే .. అదే ప్లస్ ఆమెకు మైనస్‌గా మారుతుందని ఎవరు ఊహించగలరు ? కానీ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ విషయం లో ఇది నిజమైపోయిందని బాలీవుడ్ లో టాక్ ! కాజల్ అగర్వాల్ - తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. లక్ష్మీకళ్యాణం సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ , మగధీర , బాద్షా, బిజినెస్ మాన్ , గోవిందుడు అందరివాడేలే వంటి బిగ్ మూవీస్‌తో ఓ రేంజ్‌కి వెళ్ళిపోయింది. కెరీర్ పీక్‌లోనే పెళ్లి చేసుకుని బ్రేక్ తీసుకున్నా, ఇప్పుడు రీ ఎంట్రీలో మళ్లీ జోష్ మీద ఉంది.


ఇటీవలే ఓ క్రేజీ అప్‌డేట్ నెట్టింట్లో వైరల్ అయింది. రామాయణం సినిమాలో రావణుడి భార్య మండోదరి పాత్రకి కాజల్‌ను సెలెక్ట్ చేశారని వార్తలు వచ్చాయి. సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ లాంటి గ్లామరస్ బ్యూటీ రావణునికి భార్యగా ఉండగా.. అదే రావణుడు సీతపై కన్నేయడం "లాజిక్ కాదు" అంటూ నెటిజన్స్ ఓ రేంజ్‌లో ట్రోల్స్ చేస్తూ, మండిపడ్డారు. అందంగా ఉన్నా, గ్లామర్ ఉప్పొంగిపోతున్నా, స్క్రీన్ మీద స్టార్ లుగా మెరిసిపోతున్నా… ఇప్పటికీ కాజల్ వయసుతో సంబంధం లేకుండా తనకంటూ క్రేజ్ ఉంది. కానీ అదే ఆమెకు బిగ్ సినిమా ఆఫర్ పోయేలా చేసిందని టాక్ వినిపిస్తుంది.


"మండోదరి పాత్రకు కాజల్ ఓవర్ గ్లామర్ గా ఉందని భావించి చిత్రబృందం వెనక్కి తగ్గిందట!" – ఇలాంటివే ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్తలు. "ఇంట్లో కాజల్ ఉంటే రావణుడు బయట సీతపై కన్నేయడం వింత కాదు?" "సాయి పల్లవి పక్కన కాజల్ అగర్వాల్ అంటే ఏంటి లాజిక్?" – అంటూ నెటిజన్స్ కామెంట్లు పడ్డాయి . ఈ నెగెటివ్ బజ్ సినిమా టీమ్‌ని డిసిషన్ మార్చేలా చేసిందా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్! ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో త్వరలో తెలుస్తుంది. కానీ ఓ స్టార్ హీరోయిన్‌కు… "చాలా అందంగా ఉంది" అన్న కారణంతో ఓ బడా ఆఫర్ పోయిందంటే, అది నిజమే అయితే ఈ ఇండస్ట్రీలో ట్రెండ్ ఎలా తిరుగుతోందో చెప్పడానికే సాక్ష్యం! కాజల్‌ను మళ్లీ వెండితెరపై ఓ పవర్‌ఫుల్ రోల్‌లో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ గాసిప్‌కు తెరపడే రోజు ఎప్పుడో చూద్దాం!

మరింత సమాచారం తెలుసుకోండి: