
అవార్డుల జాబితా కాదు.. ఒక నటుడి జీవన ప్రామాణికత! :
పద్మశ్రీ అవార్డు – 2015 : భారత ప్రభుత్వం 2015లో తెలుగు చిత్ర పరిశ్రమలో 37 ఏళ్ల సేవలకు గాను దేశానికి నాల్గవ అత్యున్నత పురస్కారం అయిన పద్మశ్రీను ప్రదానం చేసింది.
నంది అవార్డులు – 9 సార్లు! : ప్రతినాయకుడు, క్యారెక్టర్ ఆర్టిస్టు, సహాయ నటుడిగా తొమ్మిది సార్లు నంది అవార్డులు అందుకున్న ఘనత కోటకి మాత్రమే సాధ్యమైంది.
SIIMA అవార్డు – 2012 : "కృష్ణం వందే జగద్గురుమ్" చిత్రంలో ఆయన నటనకు 2012లో SIIMA బహుమతి దక్కింది.
అక్కినేని సెంటినరీ ఫిలిం అవార్డు – 2025 : 2025లో జీవన సాఫల్య పురస్కారం అందుకున్న కోటగారు, తన నట ప్రస్థానాన్ని అంతం చేసుకునే ముందే మరో గొప్ప గుర్తింపు పొందారు.
తెలుగు సినీ చరిత్రలో కోట పేరు – శాశ్వతం : కోట శ్రీనివాసరావు గారి జీవితమే ఒక నటనాసాధన. నవ్విస్తూ నిజం చెప్పిన నటుడు, తనదైన శైలిలో చమత్కారంగా మాట్లాడిన విమర్శకుడు, హృదయాన్ని తాకే కవితలు రాసిన భావవంతుడు – ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది. ఇలా ఒక్కసారి ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఓ ఫ్యామిలీలా విలపించింది… హీరోలు, దర్శకులు, నిర్మాతలు – చిన్నవారు, పెద్దవారు అని తేడా లేకుండా కోట గారి మరణ వార్తతో దిగ్భ్రాంతి చెందారు. “కోట గారు లేరంటే నమ్మలేకపోతున్నాం” అంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ప్రగాఢ సంతాపం తెలిపారు. తెలుగు సినీ చరిత్రలో కోట పేరు – శాశ్వతం , ఆయన మాట్లాడిన ప్రతి డైలాగ్, నవ్వించిన ప్రతి సందర్భం, ఆలచింపజేసిన ప్రతి అభిప్రాయం – ఇపుడు ఒక గొప్ప జ్ఞాపకంగా నిలిచిపోతుంది.